Chinna Pillala Neethi Kathalu In Telugu - చిన్న పిల్లల నీతి కథలు
1) గుర్రం స్వార్థం
ఒక వర్తకునికి ఒక గుర్రము, ఒక గాడిద ఉన్నాయి. ప్రతిరోజూ సరకు మూటలను ఆ రెండింటి పైనా వేసి మార్కెట్టుకు తోలుకుని పోతుండేవాడు. ఒకరోజున ఎక్కువ సరుకులు లేనందున కొన్ని మూటలను గాడిదపైన మాత్రమేవేసి మార్కెట్‌కు తోలుకొని వెళ్తున్నాడు. అలవాటు ప్రకారం గుర్రం కూడా వీళ్ళ ప్రక్కనే నడుస్తోంది. ఆ రోజున ఎండ చాలఎక్కువగా ఉంది. సరుకులు మోయలేక గాడిద ఆయాసపడిపోతోంది.
చివరకది మెల్లగా గుర్రం చెవిలో “మిత్రమా! కొంచెంసేపు యీ బరువును నీవు మోసుకొనివస్తే, ఆయాసం తీరిన తర్వాత మళ్ళీ నేనే మోసుకొస్తాను. దయచేసి యీ సహాయం చేయి!” అంది.
దానికి గుర్రం కోపంగా “ఎవరిబరువును వాళ్ళే మోయాలి. నేనెందుకు, మోస్తానూ?” అంది. ఆ మాటలు విని గాడిదకు చాలా బాధకలిగింది. కాని అది, గుర్రాన్ని ఏమీ అనలేదు. కొంచెంసేపు నడచి, వడదెబ్బకు తట్టుకోలేక గాడిద మూర్చబోయింది.
ఎట్లాగైనా తన సరుకును తొందరగా మార్కెట్‌కు చేర్చాలి అనే తలంపుతో ఆ వర్తకుడు మూటలన్నీటినీ తీసి గుర్రం వీపుపైన వేసి తీసుకొని వెళ్లాడు. కొంచెం దూరం మోయడానికి బదులు పూర్తిదూరం ఆ సరుకునంతటినీ మోయవల్సి వచ్చింది గుర్రానికి.
నీతి:- ఇతరులకు సాయంచేస్తే అదినీకు మేలు చేస్తుంది.
2) రాజుగారు - గొల్లపిల్లవాడు
అనగనగా ఒకరోజు రాజుగారు అడవికి వెళ్ళారు. అక్కడ చాలాసేపు వేటాడి అలసిపోయి కొండపైనున్న ఒక చెట్టునీడలో కొంతసేపు విశ్రాంతి తీసుకొన్నారు. ఆయనకు అక్కడి ప్రకృతి ఎంతో అందంగా కన్పించింది. ఆయన గొప్ప చిత్రకారుడు. అందుచేత అచ్చటి అందాలను రంగులతో మేళవించి చక్కని చిత్రం గీయాలనుకొన్నారు. వెంటనే వెళ్ళి గుర్రానికి వ్రేలాడుతున్న సంచీనుండి. చిత్రలేఖనానికి కావల్సిన సామాన్ల నన్నిటినీ తెచ్చుకొని చిత్రాన్ని తయారుచేశారు.
దాని అందానికి ఆయన ముగ్దుడై అన్నిప్రక్కలనుండి చూచి ఆనందించాలని! తలచి, మొదట కుడిప్రక్కకు, తర్వాత ఎడమప్రక్కకు, మరలా ఎదుటివైపునకు వెళ్ళి చూస్తున్నారు. కొంచెం కొంచెం వెనుకకు నడుస్తూ దాని అందాన్ని చూసి సంబరపడసాగారు. కాని ఆయన వెనుకనున్నది. కొండ కొన. అది దాటితే ఆయన లోయలో పడిపోవడం ఖాయం. కాని ఆయన అది గమనించడం లేదు.
ఈ విషయాన్ని ఆ దారినపోతున్న ఒక గొల్లపిల్లవాడు చూశాడు. వాడు చాలా తెలివైనవాడు. “అయ్యో! రాజుగారు లోయలో పడిపోయేటట్లున్నారు. ఎట్లాగైనా ఆయన్ని రక్షించాలి” అనుకొన్నాడు. ఒకవేళ కేకవేసి చెప్పుదామంటే ఆయన కంగారుపడి లోయలోకి తూలిపడవచ్చు. అందుచేత వానికొక ఉపాయం తట్టింది. వాడు గబగబా చిత్రాన్ని వేలాడదీసిన కొయ్యవద్దకు వెళ్ళి చిత్రాన్ని పుటుక్కున చింపివేశాడు.
రాజుగారు కోపంతో రుద్రుడైపోయి వాని చెంప 'ఛెళ్ళు' మనిపించారు. తర్వాత 'ఎందుకిట్లా చేశావని' అడిగారు. “మీరు కొండకొన మీద నిలబడి ఉన్నారు. ఒక్కఅడుగు వెనక్కువేస్తే మీరు లోయలోపడి పోవడం ఖాయం. అందుచేత మిమ్మల్ని రక్షించడానికే నేనీ పనిచేశాను” అని, చెప్పాడు వాడు.
రాజుగారు ఒకసారి వెనుకకు చూచి “ఔను! నిజమే!” అని తమతప్పు తెలిసికొన్నారు. ఆ పిల్లవానికి ధన్యవాదాలుచెప్పి తనతోబాటుగా తన రాజధానికి తీసుకొనిపోయి, అచ్చట వానికి విద్యాబుద్ధులు నేర్పించారు. తర్వాత ఆ పిల్లవాడే అఖండ తెలితేటలతో పెద్దవాదై రాజుగారి మంత్రి అయ్యాడు.
నీతి:- సమయానికి తగ్గతెలివి ఉంటే ఆపదలు రావు.
3) పిరికి కుందేలు
ఒక అడవిలో ఒక తెల్ల కుందేలు ఉండేది. అది చాలా పిరికిది. చిన్నచప్పుడైతే చాలు ఎంతో భయపడిపోయేది. ఒక రోజున అది ఒక మామిడి చెట్టుక్రింద పండుకొంది. చెట్టునిండా | బోలెడు మామిడికాయలున్నాయి.
ఆ చెట్టునుండి ఒకపండురాలి క్రింద బడింది. భయపడిన కుందేలు ఒక్క ఉదుటున పరుగులంకించుకొంది. కొండ విరిగి దానిమీద పడిందనుకొంది. “కొండ విరిగి మీద పడుతోందర్రోయ్! పరుగెత్తండర్రోయ్!” అంటూ పరుగుతీసింది. ఇది విన్న జింకలు కొన్ని దాని వెనకే పరిగెట్టడం మొదలు పెట్టాయి.
వాటి వెనుక గుర్రాలు, ఒంటెలు, వాటికుటుంబాలతో సహా పరిగెడుతున్నాయి. ఇంతలో ఒక ఏనుగులమంద వీటిని చూసి “ఏమిటి సంగతి? మీరంతా ఎందుకు పరిగెడుతున్నారు?” అన్ని అడిగాయి. “ఆకాశం విరిగి పడుతోందని మేమంతా పరుగెడుతున్నాం. మీప్రాణాల్ని కాపాడుకోవాలంటే మీరు కూడా మాతోరండి” అన్నాయి.
వీటి వెనుక నక్కలూ, తోడేళ్ళూ బయలుదేరాయి. నక్కలకు తెలివి ఎక్కువగదా! అందులోని ఒక 'ముసలి నక్క' తమరాజైన సింహం వద్దకు ఈజంతువుల నన్నిటినీ, తీసికొని వెళ్ళింది. జంతువులన్నీ గూడా రాజుగారి గుహ వద్దకువచ్చాయి. ఆ గోలకి సింహం బయటికి వచ్చి “మీరు అందరూ యిక్కడికి ఎందుకు వచ్చారు?" అని అడిగింది.
“మహాప్రభో! కొండ విరిగి మీదపడబోతోంది. మీరు ఎలాగైనా మమ్మల్ని. కాపాడాలి” అని మొరపెట్టుకున్నాయి. “కొండ విరిగి మీద పడ్తున్నదని ఎవరు చెప్పారు.?” అడిగింది సింహం.
“అదిగో! ఆ తెల్లకుందేలు చెప్పింది” అన్నాయి జంతువులు. “నీవు కొండ! . ఎక్కడ విరిగిపడ్తోంటే చూశావో అక్కడికి నన్ను తీసుకొని వెళ్ళు” అంది సింహం కుందేలుతో.
అప్పుడు తెల్ల కుందేలు, సింహాన్ని మిగతా జంతువుల్నీ కూడా. తీసుకొని. అ మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళింది. ఆ చుట్టుప్రక్కల అంతా వెదికితే సింహానికి ఒక మామిడిపండు కన్పించింది. అంతేకాని యింకేమీ కన్పించలేదు. అప్పుడది కుందేలుతో “ఈ మామిడిపండే నీమీద పడింది. దీన్నిచూచి నీవు ఆకాశం విరిగిపడుతోందని భయపడ్డావు. అందర్నీ భయపెట్టావు” అంది.
“ఓసి! తెల్లకుందేలు! మమ్మలందర్ని భయపెట్టి చంపావుకదే! మా బుద్ధి తక్కువ కొద్దీ నీ మాటలు నమ్మి పరుగెత్తాము” అని జంతువులన్నీ ఎంతో తిట్టుకుంటూ తమ తమ ఇండ్లకు పోయాయి.
నీతి;- ఆలోచించనిదే ఏపనీ చేయరాదు.
4) కోతలరాయుడు
ఒకరోజున ఒకవస్తాదు రాజుగారి వద్దకు వచ్చాడు. అతడు రాజుగారితో “రాజా! నేను చాల బలవంతుణ్ణి. నేను ఒకసారి ఒకపర్వతాన్ని కూడా పైకి ఎత్తాను. నేను రోజూ వందశేర్ల పాలు తాగుతాను. నేను సింహాలతో కూడా పోట్లాడాను” అని చెప్పాడు.
ఆ కండలు తిరిగినవీరుని చూచి రాజుగారు చాల మెచ్చుకున్నారు. “ఇటువంటి వీరుడు నా రాజ్యంలో ఉంటే ముందు ముందు చాల ఉపయోగముంటుంది” అనుకొని రాజుగారు అతణ్డి తన కొలువులో ఉద్యోగిగా నియమించారు.
నిజానికి ఆ వస్తాదుకు పనేమీ ఉండేదికాదు. మితిమీరిన తిండిమెక్కడం- శుభ్రంగా గుర్రుపెట్టి నిద్రపోవడం! ఇట్లా కొన్నాళ్ళు గడచింది.
అక్కడకు దగ్గరలో ఒక పెద్ద అడవి ఉంది. రాత్రి కాగానే తోడేళ్ళు, పెద్ద పులుల వంటి క్రూరజంతువులు ఆ రాజ్యంలోనికి ప్రవేశించి అనేక పశువుల్ని, 'మనుషుల్నీ కూడా చంపి తినివేయసాగాయి.
ప్రజలు వచ్చి రాజుగారితో తమకష్టాల్ని తొలగించవల్సిందని మొరబెట్టుకున్నారు. అప్పుడు రాజుగార్కి వస్తాదు, అతని సాహసకృత్యాలు జ్ఞాపకం వచ్చాయి. వెంటనే ఆయన వస్తాదును పిలిపించి “నీవు ఇదివరకు ఒక పర్వతాన్ని ఎత్తి అవతలపడవేసినట్లు చెప్పావు. అది నాకు గుర్తుంది. ఇప్పుడు మా రాజ్యంలో అడవితోనున్న పర్వతమొకటి ఉంది. దాన్ని ఎత్తి ఎక్కడేనా పడవేయాలి.” అని చెప్పారు.
అందుకు అంగీకరించాడు వస్తాదు. ఆ రోజున మామూలుకంటె ఎక్కువ తిండితిని బోలెడన్ని పాలుత్రాగాడు. రాజుగారు, మిగతా ఉద్యోగులూ తన వెంటరాగా వస్తాదు ఆ పర్వతం వద్దకు చేరుకొన్నాడు. వెంటనే అతడు రాజుగారితో “మహారాజా! మీమనుష్యులచేత పర్వతాన్ని త్రవ్వించండి. అప్పుడు దానిని పైకెత్తి ఆవలపడవేస్తాను” అన్నాడు.
రాజుగార్మి పిచ్చెక్కినంత పనైంది. “ పర్వతాన్ని త్రవ్వడమేమిటి? పూర్వం నీవే పర్వతాన్ని ఎత్తి పడవేశానని చెప్పావు కదా?” అని అడిగారు రాజుగారు.
“జెను! పర్వతాన్ని ఎత్తినట్లు చెప్పాను కాని నేను త్రవ్విపైకెత్తేనని చెప్పలేదు” అన్నాడు వస్తాదు.
రాజుగార్మి అంతులేని కోపంవచ్చింది. “వీడిమాటలు నమ్మి, ఇంతకాలం అనవసరంగా వీణ్ణిమేపాం.. ఈ మోసగాణ్ని తన్ని తరిమేయండి. ఇటువంటి కోతలరాయుళ్ళు మనకొద్దు” అన్నారు రాజుగారు.
నీతి:- గొప్పలు చెప్పకు-కష్టాల్ని కొనితెచ్చుకోకు
5) వర్తకుడు-గాడిద
ఒక వర్తకుడు తన వర్తకం కోసం ఒక గాడిదను కొని దాన్ని చాలా జాగ్రత్తగా మేపేవాడు.. ప్రతీరోజూ కొన్ని సరుకులమూటలను దానిపై వేసి తీసుకొని వెళ్ళి అమ్ముకొనేవాడు.
వేసవిలో ఒకరోజున అతడు గాడిదపై సరుకులువేసి ప్రక్క ఊరికి బయలుదేరాడు. ఆ రోజున ఎండచాల ఎక్కువగా ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక ప్రయాణీకుడు తోడయ్యాడు. కబుర్లు చెప్పుకొంటూ వాళ్ళు, గాడిదతో కలిసి కొంత దూరం ప్రయాణం చేశారు. ఎండ తీవ్రతవల్ల, నడకవల్లా. వారికి చాల నీరసమనిపించింది.
అందుచేత కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత వెళ్ళవచ్చునని వాళ్ళు గాడిదను ఒక ప్రక్కన నిలబెట్టారు. వెంటనే ప్రయాణీకుడు. వెళ్ళి గాడిద నీడలో పడుకొన్నాడు. ఎండచాల ఎక్కువగా ఉంది. వర్తకునికి నీడే లేకుండాపోయింది. అందుచేత అతడు. కోపంగా “ఇది నా గాడిద. దీని నీడలో నిద్రించే హక్కు నాకే ఉంది” అన్నాడు.
“ముందుగా నేను పడుకొన్నాను. కనుక ఈ నీడ నాదే! పైగా, నేను పడుకొనేవరకూ ఆ నీడనే నీవు చూడలేదు” అన్నాడు బాటసారి. ఎంతసేపైనా వారి వాదనలు పూర్తికావడంలేదు.
ఒకప్రక్క ఎండవేడి, మరొకప్రక్క వీళ్ళిద్దరి వాదోపవాదాలు. భరించలేక పోయింది ఆ గాడిద. చల్లగా ప్రక్కనుండి జారుకొని ఎటో వెళ్ళిపోయింది. వాళ్ళ గొడవపూర్తయ్యేసరికి గాడిద అక్కడలేదు. లబోదిబోమని మొత్తుకుంటూ వర్తకుడు దాన్ని వెతకడాన్మి పరుగు. లంకించుకొన్నాడు.
నీతి:- లేనిదానికి ఏడుస్తే ఉన్నదికూడా పోతుంది.
6) పావురం-చీమ
ఒకరోజున అడవిలోని చిన్న చెరువులో ఒక చీమ పడిపోయింది. పాపం! దానికి ఈతరాదు. ప్రాణాల్ని కాపాడుకోవాలని ఎంతో తాపత్రయపడుతోంది.
ప్రక్కనే చెట్టుపై కూర్చొన్న పావురానికి ఆ చీమ కన్పించింది. చీమ పరిస్థితిని చూసి దానికి జాలివేసింది. వెంటనే ఒక ఆకును త్రెంచి చీమకు దగ్గరగా నీటిలో వేసింది. చీమ దానిపైకి ఎక్కి క్షేమంగా ఒడ్డుకుచేరుకొంది.
ఒకరోజున చీమ అక్కడిపచ్చగడ్డిలో తిరుగాడుతూ, చెట్టుపైన కూర్చొన్న పావురాన్ని చూచి దాన్ని పలకరిద్దామనుకొంది. ఇంతలో, దగ్గరలోనే ఒక మనిషి తుపాకితో నిల్చుని ఉండడం చూసింది.
అతడు పావురాన్ని చంపడానికి తుపాకి గురిపెడుతున్నాడు. చీమ, పావురాన్ని ఎలాగైనా రక్షించాలనుకొంది. అది వెంటనే వేటగాడి కాలుమీద పుటుక్కున కుట్టింది. ఆ బాధతో “అమ్మో!” అని అరచి, తుపాకిని ప్రక్కన పడేసి వేటగాడు తనకాలును చూచుకొన సాగాడు. వాడి అరుపుకు హడలిపోయిన పావురం ఎగిరిపోయింది.
ఇట్లా చీమ, పావురాన్ని రక్షించి దానికి ప్రత్యుపకారం చేసింది.
నీతి:- ఆపదలో ఆదుకొన్నవాడే నిజమైన మిత్రుడు
👉 Panchatantra Stories In Telugu With Moral • పంచతంత్ర కథలు 👈