కుందేలు మరియు ఏనుగు Panchatantra Story
మిత్రులతో ఆటలు (కుందేలు మరియు ఏనుగు నీతి కథ ) :
ఒక అడవిలో ఏనుగు మరియు కుందేలు నివసిస్తున్నాయి. ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి అడవిలో తిరుగుతూ వుంటారు. వారిద్దరి స్నేహం గురించి అడవిలో అన్ని జంతువులకి తెలుసు.
ఒక రోజు వాతావరణం బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది. ఆకుపచ్చ గడ్డి చాల బాగుంది. కుందేలు మరియు ఏనుగు చాలా ఆహారం తిన్నాయి. రెండు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, అవి సరదాగా ఒక ఆట ఆడదాం అని అనుకున్నాయి.
ఏనుగు మరియు కుందేలు ఏ ఆట ఆడాలో ఆలోచిస్తున్నాయి. మరియు ఆట ఆడటానికి ఒప్పుకున్నాయి. కానీ, పాత ఆట ఆడకూడదు, కొత్త ఆట ఆడాలి అని నిర్ణయించుకున్నాయి.
"పాత ఆటల కంటే ఒక మంచి కొత్త ఆట ఆడదాం నాకు ఒక ఆలోచన వచ్చింది". అని ఏనుగు కుందేలుతో చెప్పింది.
ఆట ఇలా ఉంటుంది "మొదట నేను కూర్చుంటాను, అప్పుడు నీవు నా పైన నుండి మరొక వైపు దూకాలి, ఆ తరువాత నీవు కూర్చోవాలి. అప్పుడు నేను నీ పైన నుండి మరొక వైపు దూకుతాను. కానీ ఈ ఆటలో, ఒకరినొకరు తాకవద్దు. నీవు నన్ను తాకకుండా మరొక వైపుకు దూకాలి." అని ఏనుగు ఆట యొక్క రూల్స్ చెప్పింది.
కుందేలు ఆట రూల్స్ వినగానే భయపడింది. కాని, స్నేహితుడికి ఆడాలని కోరిక ఉన్నందున, కుందేలు ఆట ఆడటానికి అంగీకరించింది.
మొదట ఏనుగు నేలమీద కూర్చుంది, కుందేలు పరిగెత్తుకుంటు వచ్చి ఏనుగు పైనుంచి మరొక వైపు తాకకుండా దూకింది. ఇప్పుడు ఏనుగు ఆడాల్సిన సమయం.
కుందేలు కూర్చుంది కాని, "ఒకవేళ ఏనుగు నాపైకి దూకితే నేను చనిపోతాను, నా జీవితం ఇంతటితో ముగుస్తుంది" అని భయపడుతుంది. ఏనుగు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏనుగు పరుగెత్తటం వల్ల, కుడి ఎడమ వైపున ఉన్న కొబ్బరి చెట్లు కదులుతున్నాయి. అంతేకాకుండా కొబ్బరికాయలు పైనుండి విరిగి వాటిపై పడుతున్నాయి.
ఏనుగుకి ఏమీ అర్థం కాలేదు, అక్కడి నుండి పారిపోయింది. కుందేలు కూడా తన ప్రాణాలతో అక్కడి నుండి పారిపోయింది. ఏనుగు కంటే ఈ కొబ్బరికాయలు పడటం మంచిదని ఆలోచిస్తూ కుందేలు పారిపోతోంది.
"ఒకవేళ నా స్నేహితుడు ఇప్పుడు నాపై పడి ఉంటే, నేను చనిపోయి వుండే వాడిని, ఇలాంటి ఆటలు ఎప్పుడు ఆడకూడదు". అని కుందేలు ఊపిరి పీల్చుకుంది.
Moral Of The Story:
ప్రతి ఒక్కరికి నిజమైన స్నేహితుడు ఉండటం మంచిది, కానీ స్నేహితుడితో హాని కలిగించే ఆటలు ఎప్పుడు ఆడకూడదు.
మీ ప్రాణాలకు హాని కలిగించే, చావుకి దారి తీసే ఆటలు ఆడకండి లేదా పాల్గొనవద్దు.
స్నేహితులతో ఆటలు ఆడాలి కానీ, ఆటలను ఎంచుకునేటప్పుడు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. మరియు మీరు ఇంటి నుండి దూరంగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి.