This story is about how two clever crows got rid of a Python. This is the moral story of two clever crows in Telugu
Clever Crows Moral Story In Telugu | తెలివైన కాకులు నీతి కథ
Clever Crows Story in Telugu: ఒకప్పుడు, రాజు ప్యాలెస్ తోటలో ఒక కాకి మరియు కాకి భార్య వున్నాయి. ఆ రెండు కాకులు తోటలోని అతిపెద్ద చెట్టు మీద ఉంటుంన్నాయి. అదే చెట్టు కింద తొర్రలో ఒక కొండచిలువ వుంది.
కొండచిలువ ఆ చెట్టు కింద ఉంటుందని కాకికి తెలుసు, కానీ ఆ కాకులు ఆ చెట్టు మీద చాలా కాలం నుండి నివసిస్తున్నాయి. ఆ రెండు కాకులు ఉదయం ఆహారం కోసం బయటికి వెళ్లి సాయంత్రం ఆహారంతో వాటి గూటికి తిరిగి వస్తాయి.
కొంత కాలం గడిచిన తరువాత. ఒక రోజు ఆడ కాకి రెండు గుడ్లు పెట్టింది. రెండు కాకులు చాలా సంతోషంగా ఉన్నాయి. మరుసటి రోజు, రెండు కాకులు తమ గూటిలో గుడ్లను వదిలి ఉదయం ఆహరం కోసం వెళ్ళాయి.
అవి సాయంత్రం ఆహారంతో తిరిగి వచ్చాయి. గూటికి వచ్చాక వాటి గుడ్లు లేవు. దీనితో రెండు కాకులు చాలా బాధ పడ్డాయి. కొన్ని రోజుల తరువాత, ఆడ కాకి మళ్ళీ గుడ్లు పెట్టింది.
మరుసటి రోజు ఆ కాకులు ప్రతిరోజు లాగానే ఆహరం కోసం బయలుదేరాయి . రెండు కాకులు వెళ్ళిన తరువాత కొండచిలువ వచ్చి ఇంతకుముందు లాగానే కాకి గుడ్లు తిన్నది.
కాకులు సాయంత్రం ఆహారంతో తమ గూటికి తిరిగి వచ్చినప్పుడు, వాటి గుడ్లు కనిపించడం లేదు. ఇది చూసిన రెండు కాకులు చాలా బాధతో ఏడ్చాయి.
ఇది ఖచ్చితంగా చెట్టు క్రింద నివసించే కొండచిలువ యొక్క పని అని వాటికి అర్థమైంది. ఆ కాకులు చాలా తెలివైనవి, కొండచిలువ నుండి ఎలాగైనా తప్పించుకోవాలి అని అనుకున్నాయి.
ఒక రోజు "రాణి గారు" చెరువులో స్నానం చేస్తున్నప్పుడు. అప్పుడు రాణి యొక్క ఒక ముత్యాల హారమును కాకి దొంగిలించింది. సైనికులు దానిని చూశారు. వారు ఆ కాకిని అనుసరించారు. కాకి హారమును తీసుకొని కొండచిలువ ఉండే చెట్టు తొర్రలో వేసింది.
సైనికులు ముత్యాల హారాన్ని తీయబోయినప్పుడు వారికి కొండచిలువ కనిపించింది. సైనికులు కొండచిలువను చంపి ముత్యాల హారాన్ని తీసుకున్నారు. ఈ విధంగా రెండు కాకులు కొండచిలువను నుండి బయటపడ్డాయి. మరియు ఆ తరువాత నుండి రెండు కాకులు సంతోషంగా జీవిస్తున్నాయి.
Moral Of The Story (కథ యొక్క నీతి):
"మన తెలివితేటలను ఉపయోగించి అతి పెద్ద సమస్యలను కూడా వదిలించుకోవచ్చని ఈ కథ నుండి నేర్చుకుంటాము."
Also, Read Panchatantra Stories In Telugu With Moral • పంచతంత్ర కథలు
Also Read: 10 Stories In Telugu With Moral
Also Read: Rabbit Story | కుందేలు నీతి కథ
Also Read: కూతురు కొడుకు కంటే తక్కువ కాదు