Emotional Moral Stories In Telugu | కూతురు కొడుకు కంటే తక్కువ కాదు

Moral Stories in Telugu, Through this story, we learn that there should be no distinction between son and daughter. Interesting and Emotional Moral story in Telugu that children and adults can read. It would be good for everyone to read.

This is one of the best moral stories in Telugu, About this story, In which the real thing that happens in the current society. And This story that everyone should definitely read This is The Good Moral Story in Telugu

Moral Stories In Telugu | కూతురు కొడుకు కంటే తక్కువ కాదు

Moral Story in Telugu: వీరయ్య మరియు పద్మ భార్యాభర్తలు ఒక గ్రామంలో ఉండేవారు. కొంత కాలం తరువాత వారు బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నారు. పద్మను ఆసుపత్రిలో చేర్చారు. నర్సు వచ్చి మీకు కవల పిల్లలు పుట్టారని వీరయ్యకు శుభవార్త చెప్పింది. 

వీరయ్య ఇద్దరు అబ్బాయిలేన అని అడుగుతాడు. కానీ, ఒక అబ్బాయి అమ్మాయి అని నర్సు చెప్తుంది. వీరయ్యకి అమ్మాయి పుట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే అమ్మాయి కి పెళ్లి చేయడానికి ఖర్చు అవుతుందని అతని భయం. 

వారం రోజుల తరువాత వీరయ్య తన భార్య, పిల్లలను తీసుకొని తన ఇంటికి వచ్చాడు. అతను ఎక్కువగా అబ్బాయిని ఇష్టంగా పెంచేవాడు, ఎక్కువగా అబ్బాయికె భోజనం తినిపించేయాడు, గారాబంగా చూసుకునేవాడు. వీరయ్య ఇలా చేయడం పద్మకు నచ్చలేదు. 

ఒక రోజు వీరయ్య తన భార్యతో "మనము ఇద్దరు పిల్లలను పోషించలేము. ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగాలేదు" అని చెప్పాడు.

అంతే  కాకుండా, "అమ్మాయికి  పెళ్లి  చేయాలి, వాటి ఖర్చులను మనము భరించలేము. కాబట్టి మనం అమ్మాయిని నా స్నేహితుడికి అప్పగిద్దాము. వాళ్లకి సంతానం కూడ లేదు. వాళ్ళు మన అమ్మాయిని మనకన్నా బాగా పెంచుతారు. ఎందుకంటే వాళ్ళు చాలా ధనవంతులు".

పద్మ వారి అమ్మాయిని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కాని, పాపం వీరయ్య ప్రతిరోజు వేదించేసరికి ఆమె వీరయ్య‌ చెప్పినదానికి అంగీకరించింది. వీరయ్య వారి అమ్మాయిని తన స్నేహితుడి భార్యకు అప్పగించాడు. వారికి పిల్లలు లేనందున, అమ్మాయిని  తీసుకొని చాల సంతోషంగా వున్నారు. 

Moral Stories In Telugu | కూతురు కొడుకు కంటే తక్కువ కాదు

కొంత కాలం గడిచిన తరువాత, వీరయ్య తన అబ్బాయిని బాగా పెంచుకున్నాడు. అతను అడిగినవి కాదనకుండా ఇచ్చేవాడు,  ప్రతి కోరికను నెరవేర్చాడు. అబ్బాయికి 20 ఏళ్ళ వయసులో, తనకు బైక్ కొనివ్వమని పట్టుబట్టాడు. 

వీరయ్య తన భార్య నగలు అమ్మేసి ఆమెకు బైక్ తీసుకున్నాడు. కొంత కాలం తరువాత, అతను తన అబ్బాయి బాగుండాలని వారి పొలం అమ్మేసి ఒక దుకాణం పెట్టాడు. దానితో వారి అబ్బాయి సంపాదించడం మొదలుపెట్టాడు. 

కొన్ని నెలల తరువాత వారి అబ్బాయికి వివాహం చేసారు. వివాహం జరిగిన కొన్ని రోజుల తరువాత, కుమారుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అతను తన తండ్రితో, "నా భార్యను, నా అత్తమామలను తిట్టవద్దు". ఆంటు చిన్నవిషయాలకు ప్రతిరోజూ అతను తన తల్లిదండ్రులతో ఏదో గొడవ చేసేవాడు.

ఒక రోజు అతను వీరయ్యను  మరియు పద్మను  ఇద్దరినీ తన ఇంటి నుండి వెళ్లిపొమ్మని ఇంటినుండి బయటికి  గెంటేశాడు. వాళ్ళు చాలా అడిగిన తరువాత కూడా అతను ఇంట్లోకి రానివ్వలేదు. 

వీరయ్య మరియు అతని భార్య ఎం చేయాలో తెలియక ఒక గుడికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత, పద్మ వీరయ్యతో " గుడిలో ప్రసాదం పంచుతున్నారు ఆకలిగా వుంది తిందాము". అని చెప్పింది. 

ప్రసాదం తీసుకుంటుండగా వీరయ్య స్నేహితుడి భార్య అక్కడికి వచ్చింది. ఆమె వీరయ్యను చూసి గుర్తు పట్టింది. ఆమె తన కూతురిని వీరయ్యను పరిచయం చేసింది, "25 సంవత్సరాల క్రితం మీరు మాకు ఇచ్చిన అమ్మాయి ఈమె" అని చెప్పింది. 

"ఈ రోజు ఈ అమ్మాయి ఒక డాక్టర్. మరియు వృద్దాశ్రమం ని కూడా నడుపుతుంది". అని చెప్పింది. వీరయ్య మరియు పద్మ తమ కూతురిని కలిసి చాల ఆనందపడ్డారు.

వారు తమ కూతురితో జరిగిన అన్ని విషయాలు చెప్పారు. కూతురు వారి మాటలు విని "ఇప్పడినుండి మీరిద్దరూ నాతోనే ఉండమని చెప్తుంది". 

Also, Read Panchatantra Stories In Telugu With Moral • పంచతంత్ర కథలు

Moral Of The Story (కథ యొక్క నీతి):

"అమ్మాయి మరియు అబ్బాయిల మధ్య ఎప్పుడూ వ్యత్యాసం చూపకూడదు."


Also Read: 10 Stories In Telugu With Moral

Also Read: Rabbit Story | కుందేలు నీతి కథ

Post a Comment

Previous Post Next Post