రైతు - సోమరి పుత్రులు | Farmer - lazy sons Moral Story In Telugu
ఒక రోజున పేదరైతు తన కొడుకులతో “నేను ఒక కుండలో బంగారు నాణాలు పోసి మన చేనులో ఒకచోట పాతిబెట్టాను. చాలా కాలమైంది కదా! నేనవి ఎక్కడ పాతిబెట్టానో మరచిపోయాను. అందుచేత మీరు చేనునంతా బాగా త్రవ్వి ఆ కుండను వెతికి పట్టుకొనిరండి!” అని చెప్పాడు.
మహా సంతోషంతో ఆ ముగ్గురూ కుమారులు పొలం దగ్గరికి చేరుకొన్నారు. అతికష్టపడి చేను నంతా త్రవ్వి చూశారు. కాని వాళ్ళకి ఆ కుండ కన్పించలేదు. తిరిగి వచ్చి వాళ్ళు ఆ సంగతి తండ్రికి చెప్పారు.
“కుండ పోతే పోయిందిలే! మీరు కష్టపడి చేనునంతా త్రవ్వారు కదా! ఇప్పుడు కొన్ని విత్తనాలను కొని తెచ్చి చేలో చల్లండి” అన్నాడు తండ్రి. “సరే!” అని వెళ్ళి వాళ్ళు విత్తనాలు కొని తెచ్చి చేనులో చల్లారు.
అదృష్టం కొద్దీ. విత్తనాలు చల్లిన కొద్ధి రోజులలోనే చక్కటి వర్షాలు పడ్డాయి. చేను చాలా ఏపుగా పెరిగింది. రైతు చేను వద్దకు వెళ్ళి చేను చాల పచ్చగా ఉండటం చూసి మురిసిపోయాడు.
పంట చాలా బాగా పండింది. బళ్ళ కొద్దీ ధాన్యం ఇంటికి చేరాయి. తినడానికి కొన్ని బస్తాలను మిగిల్చి మిలిగిన బస్తాలను బజారులో అమ్మవలసినదిగా కొడుకులకు చెప్పాడు రైతు.
ఆ రైతు పుత్రులు ధాన్యం అమ్మగా వచ్చిన మూడు వేల రూపాయలను తండ్రికి తెచ్చిఇచ్చారు. అప్పుడు రైతు కొడుకులతో “ఇదే నేను చేలో పాతిన సొమ్ము! ఇట్లాగే మీరు ప్రతీ సంవత్సరము కష్టపడి పని చేస్తే మీకు బోలెడంత డబ్బువస్తుంది. సుఖంగా తిండి తినవచ్చు. నల్గురికీ పెట్టవచ్చును” అని చెప్పాడు.
అప్పుడు జ్ఞానోదయమయ్యింది రైతు పుత్రులకు. అప్పటినుండి 'ప్రతీసంవత్సరం వాళ్ళు కష్టపడి పంటలు పండించి గొప్ప ధనవంతులయ్యారు.
నీతి :- కష్టపడితేనే ఫలితం దక్కుతుంది
Super 💓
ReplyDelete