దురాలోచన నీతి కథ • Small Moral Story In Telugu

దురాలోచన నీతి కథ Small Moral Story In Telugu

దురాలోచన చిన్న నీతి కథ  [ Small Moral Story In Telugu ]

దురాలోచన Small Moral Story In Telugu: నర్సాపురంలో అనే ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతని పేరు వీరయ్యవీరయ్య కు చాల ఆవులు మరియు గేదెలు ఉన్నాయి, అందువలన అతను పాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగించేవాడు. 

వీరయ్య ఆవు పాలను వారి ఊరికి దగ్గరలో ఉంటున్న జిల్లాకి తీసుకెళ్లి అమ్మేవాడు. చిక్కనైన ఆవు పాలు అమ్ముతాడని చుట్టుపక్కల ఊరులలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అందువలన చాల మంది తన ఇంటిదగ్గరకి వచ్చి పాలను కొనుకొని తీసుకెళ్లేవారు, మరియు జిల్లాలోని ఒక వీధిలో ఉండే అందరూ వీరయ్య దగ్గరే పాలు కొనేవారు. 

వీరయ్య కి  ఒక రోజు పొలంలో పని ఉందని తన కొడుకు సోమేశ్ ని "ఈరోజు పాలు అమ్మడానికి తీసుకెళ్ళు". అని చెప్పాడు. సోమేశ్  పాలను తీసుకొని వెళ్తుండగా తనకు దారిలో దాహం వేసింది, అందుకు అతను దగ్గరలో వున్నా ఒక బావి దగ్గర ఆగి నీళ్లు తాగాడు.

Also, Read Panchatantra Stories In Telugu With Moral • పంచతంత్ర కథలు

అప్పుడు, అతడికి పాలల్లో నీళ్లు కలపాలని దురాలోచన వచ్చింది. తన దగ్గర ఉన్న  ఎనిమిది లీటర్ల పాలకు ఎనిమిది లీటర్ల నీళ్లను కలిపాడు. "తన తండ్రి మీద నమ్మకం  ఉంది, కాబట్టి తాను నీళ్లు కలిపినా ఈ  ఒక్క రోజుకీ  ఎవ్వరికి అనుమానం రాదులే" అని అనునుకున్నాడు.

ఆ పాలను పట్టుకెళ్లి జిల్లాలో పాలు కొనేవారి అందరికీ పోశాడు. తన తండ్రి కంటే రెట్టింపు డబ్బు సంపాదించినందుకు చాల గర్వపడ్డాడు. ఆనందంగా తిరిగి ఇంటికి వస్తున్నపుడు దారిలో సోమేశ్ మళ్లీ బావి దగ్గర నీళ్లు తాగటానికి ఆగాడు. డబ్బుల సంచిని  పక్కన పెట్టి నీళ్లు తాగుతున్నాడు. అప్పుడే ఒక కోతి వచ్చి ఆ సంచిని పట్టుకొని బావి పక్కనున్న చెట్టుని ఎక్కింది. 

సోమేశ్ చూస్తుండగానే సంచిలోని రూపాయలను తీసుకొని బావిలో సగం నేల మీదకి  సగం డబ్బులని పడేసింది. దాన్ని బెదిరించాడు, కానీ  కోతి అక్కడి నుంచి వెళ్ళలేదు. కొంత సమయం తరువాత డబ్బుల సంచిని కింద పడేసింది. 

సోమేశ్ ఆ సంచిలోకి కింద పడి ఉన్న రూపాయల్ని ఏరుకొని బాధగా ఇంటికి వెళ్ళాడు, ఇంట్లో తన తండ్రి వీరయ్యకి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. వీరయ్య సంచి తీసుకొని అందులో డబ్బుని లెక్కపెట్టగా అందులో ఎనిమిది లీటర్లకు సరిపోయే డబ్బు ఉంది.

"కోతి నీకు మంచి గుణపాఠమే చెప్పింది. ఈ సంచిలో ఎనిమిది లీటర్ల పాల డబ్బు విడిచిపెట్టి, నువ్వు కలిపిన నీళ్లకు సరిపడా డబ్బుని బావిలో పడేసింది. పాల డబ్బు మనకి, నీళ్ల డబ్బు బావికి. లెక్క సరిపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి అత్యాశ పని చేయకు" అని హితబోధ చెప్పాడు.

👉 ఇది కూడా చదవండి: Small Moral Story For Kids ఆవు మెడలో గంట

👉 ఇది కూడా చదవండి: Small Telugu Moral Story About Time | ఎప్పటి పని అప్పుడే చేయాలి

Moral Of The Story (కథ యొక్క నీతి):

"దురాలోచన మంచిది కాదు"

👍Also Read: Top 10 Stories In Telugu With Moral


ఈ చిన్న నీతి కథలు మీకు నచ్చినట్లయితే, కింద కనిపిస్తున్న ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, మరియు ఇతర సోషల్ మీడియా ద్యారా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. 



Post a Comment

Previous Post Next Post