ఎప్పటి పని అప్పుడే చేయాలి { Small Telugu Moral Story About Time And Late }
ప్రతి పనని రేపు చేద్దాంలే అనుకుంటూ వాయిదా వేస్తుంటుంది. “అలా చేయవద్దు, ఎప్పటి పని అప్పుడే చేస్తే మంచిది” అని వాళ్ళ అమ్మ ఎన్నోసార్లు అనితను చెప్పేది. కానీ అనిత నిర్లక్ష్యంతో ఆ మాటలు పట్టించుకునేది కాదు.
ఒకసారి ఆ ఊరిలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అన్ని స్కూళ్ళ విద్యార్థులకు పాటలు, ఆటల పోటీలు పెట్టారు. అనిత పాటల పోటీలో పాల్గొంది. అనిత చాల బాగా పాటలు పాడటంతో అందులో ఆమెకు మొదటి బహుమతి వచ్చింది.
కొన్నిరోజుల తరువాత ఒకరోజు సాంస్కృతిక కార్యశ్రమాలు నిర్వహించిన సంస్థ నుండి అనితకు ఒక ఉత్తరం వచ్చింది. గత నెలలో జరిగిన పాటల పోటీలోమొదటి బహుమతి వచ్చినందుకు మరునాడు తమకార్యాలయానికి వచ్చి బహుమతి తీనుకోవలసిందిగా రాశారు ఆ ఉత్తరంలో.
Also, Read Panchatantra Stories In Telugu With Moral • పంచతంత్ర కథలు
అనిత ఆ ఉత్తరాన్ని చదివి పెద్దగా పట్టించుకోలేదు. తరువాత ఎప్పుడైనా వెళ్ళి బహుమతి తెచ్చుకోవచ్చులే అనుకుని, మరుసటి రోజు పోకుండా, నాలుగు రోజుల తరవాత వెళ్లింది.
ఆ సంస్థవారు అనితకు బహుమతితో పాటు పట్టణంలో జరుగుతున్న పెద్ద సర్కస్ ను చూడ్డానికి రెండు టికెట్లు కూడా ఇచ్చారు. అయితే ఆ టికెట్టు అంతకు ముందు రోజు జరిగిన ఆటవి.
అనిత అవి చూసుకుని 'అయ్యో! కనీసం నిన్న వచ్చినా బావుండేది కదా!' అని చాల బాధపడింది. ఆ సంఘటనతో అనితలో ఎంతో మార్పు వచ్చింది. నిర్లక్షంగా ఉండకుండా, ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయడం ప్రారంభించింది.
👉 ఇది కూడా చదవండి: Small Moral Story For Kids ఆవు మెడలో గంట
Moral Of The Story (కథ యొక్క నీతి):
“ సమయం చాల విలువైనది. ఏసమయంలో చేయవలసిన పనిని అదే సమయంలో చేయాలి. లేకుంటే అదృష్టం చేజారవచ్చు ”
“Time is precious. The work to be done at that time must be done at the same time. Otherwise bad luck ”