అసూయ నీతి కథ { Jealousy Moral Story In Telugu }
Jealousy Moral Story In Telugu: చంద్రాపురం అనే ఊరిలో వినోద్, మరియు లోకేష్ అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు, వీరిద్దరూ ఇరుగుపొరుగు ఇళ్లలో ఉండేవారు. వినోద్, లోకేష్ వెళ్ళేది ఒకే బడికి, మరియు వీరిద్దరూ ఎనిమిదవ తరగతి లో చదువుతున్నారు. ఒకే క్లాస్ లో ఉంటున్నప్పటికీ వీరి మధ్య ఎటువంటి స్నేహం లేదు.
వినోద్ బుద్ధిమంతుడు. మరియు చాల తెలివైనవాడు. చక్కగా బడికి వెళ్ళి బాగా చదువుకునేవాడు. చదువుపై ఎక్కువ దృష్టి పెట్టేవాడు, సమయం ఎక్కువగా ఆటలపై వృథా చేసేవాడు కాదు, ప్రతి రోజు బడిలో చెప్పిన పాఠాలు నేర్చుకొని మంచిగ మార్కులు తెచ్చుకునేవాడు.
లోకేష్ వినోద్ కి పూర్తిగ వ్యతిరేకం. బడికి సరిగా వెళ్ళేవాడు కాదు. మరియు పాఠాలు అస్సలు చదివే వాడు కాదు. ఎల్లప్పుడూ చుట్టుప్రక్కల పిల్లలతో ఆటలు ఆడుకుంటూ సమయాన్ని వృథా చేసేవాడు. లోకేష్ తల్లిదంక్రులు, మరియు బడిలో ఉపాధ్యాయులు లోకేష్ చదువుకోకుండా సమయాన్ని వృధా చేస్తున్నందుకు లోకేష్ పై కోప్పడేవారు.
“వినోద్ ని చూసి బుద్ధి తెచ్చుకో, వాడుచాల బాగా చదువుకుని, ఎంత మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడో చూడు”. అంటూ, వినోద్ ను మెచ్చుకుంటూ లోకేష్ ను తిట్టేవారు .
అది విని లోకేష్ కి వినోద్ మీద అసూయ పడ్డాడు మరియు వినోద్ మీద చాల కోపం ఏర్పడింది. తనను తిడుతూ వినోద్ ను మెచ్చుకోవడం అతనికి నచ్చలేదు, మరియు వినోద్ ని ఎలాగైనా దెబ్బతీయాలనుకున్నాడు. బడిలో పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో ఎవరూ చూడకుండా వినోద్ బ్యాగులో పుస్తకాలన్నీ దొంగిలించి ఊరికి బయటికి వెళ్లి దూరంగా పడేశాడు లోకేష్.
పుస్తకాలు పోయినందుకు వినోద్ చాల బాధపడ్డాడు. "వాడి పని అయిపోయింది. ఇక ఇప్పటినుండి ఎలా చదువుతాడో చూస్తాను, పరీక్షల్లో కచ్చితంగా ఫెయిల్ అవుతాడు" అని అనుకున్నాడు లోకేష్.
Also, Read Panchatantra Stories In Telugu With Moral • పంచతంత్ర కథలు
పరీక్షలు వచ్చాయి. వినోద్ పరీక్షలను చక్కగా రాశాడు. కానీ, లోకేష్ సరిగ్గా రాయలేకపోయాడు. కొద్ది రోజుల తరువాత పరీక్షల ఫలితాలు వచ్చాయి. వినోద్ ఫస్ట్ క్లాస్లో పాసయ్యాడు. మరియు లోకేష్ పరీక్షల్లో ఫెయిలయ్యాడు.
లోకేష్ కి వినోద్ పరీక్షలు ఎలా పాసయ్యాడని అనుమానం కలిగింది. అప్పుడు వినోద్ దగ్గరికి వెళ్లి “నీ పుస్తకాలు పోయాయి, దొరకడం లేదు అని చెప్పావు కదా! కానీ, పరీక్షల్లో ఎలా పాసయ్యావు వినోద్?” అని లోకేష్ వినోద్ ని అడిగాడు.
అందుకు వినోద్ “నేను ఏ రోజు పాఠాలు ఆరోజే చదువుకునేవాడిని. టీచర్లు నోట్సులు రాసుకునేవాడిని, అంతేకాకుండా పద్యాలు, సమాధానాలు అన్నీ కంఠస్థం చేసుకున్నాను, అందుకే బుక్స్ పోయినా మంచిగా రాయగలిగాను” అని చెప్పాడు.
లోకేష్ తను చేసిన తప్పు తెలుసుకుని చాల సిగ్గుపడ్డాడు. ఆ రోజు నుంది లోకేష్ కూడా వినోద్ లాగా ఏ రోజు పాఠాలు ఆరోజు చదవడం ప్రారంభించాడు.
👉 ఇది కూడా చదవండి: Small Moral Story For Kids ఆవు మెడలో గంట
Moral Of The Story (కథ యొక్క నీతి):
"మనం ఎప్పుడు ఇతరులపై అసూయ పడకూడదు. మరియు ఎప్పటి పని అప్పుడే చేయాలి"
“We Should Never Be Jealous of Others
“Work on any day should be done on that day