Small Moral Story In Telugu | దురాశ నీతి కథ • Greed Moral Story

 Small Moral Story In Telugu About Greedy

Small Moral Story In Telugu  దురాశ నీతి కథ

దురాశ నీతి కథ [ A Small Parable about Greed In Telugu ]

Greed Moral Story In Telugu: అనగనగ ఒక ఊరిలో రామయ్య అనే మంచి వ్యక్తి ఉండేవాడు. ఆ ఊరిలోకి బ్రతకడానికి సోమయ్య అనే వ్యక్తి వచ్చాడు, సోమయ్యకు ఇల్లు లేదు అందుకోసం రామయ్య తన దగ్గర వున్న రెండు ఇల్లులలో ఒక ఇంటిలో ఉండమన్నాడు. ఒకరోజు సోమయ్య  బయటకువెళ్లి తన రూమ్ తాళంచెవి ఎక్కడో పోగొట్టుకున్నాడు.

'తాళంచెవి పోయిందే ఇప్పుడు ఇంట్లోకి వెళ్లడం ఎలా?' అనుకుంటూ. సోమయ్య  దిగాలుగా తన ఇంటిముందు కూర్చున్నాడు. అప్పుడే రామయ్య అడవి నుంచి తిరిగొచ్చి 'ఏం జరిగింది? ఎందుకలా బాధగా వున్నావు' అని అడిగాడు.

ఇంటి తాళంచెవి ఎక్కడో పోగుట్టుకున్నానని రామయ్య తో చెప్పాడు. తన దగ్గరున్న ఇంకొక తాళం చెవిని సోమయ్యకు ఇచ్చాడు రామయ్య. ' సోమయ్య ఆ తాళంచెవి ని రామయ్య ఇంటిదనుకున్నాడు'

సోమయ్యకు అప్పుడు ఒక చెడు ఆలోచన వచ్చింది. రామయ్య బయటకు వెళ్లినపుడు అతడి ఇంట్లోకివెళ్లి విలువైన సామాను, వస్తువులేమైనా ఉంటే దొంగిలిద్దామనుకున్నాడు. తగిన సమయం కోసం కాచుకు కూర్చున్నాడు.

ఒక రోజు రామయ్య  మరియు సోమయ్య ఇద్దరూ కలిసి కట్టెల కోసమని అడవికి వెళ్లారు. సగం దూరం వెళ్లగానే సోమయ్య 'అబ్బా నాకు కాలు నొప్పిగా ఉంది. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటాను. నువ్వు వెళ్ళు' అని చెప్పి, సోమయ్య ఊరిలోకి  తిరిగి వచ్చేశాడు. 

ఆలా వచ్చి సరాసరి రామయ్య ఇంటికి పోయి తన దగ్గరున్న తాళంచెవి తో తలుపు తెరవడానికి ప్రయత్నించాడు,  కానీ ఆ తాళం చెవి రామయ్య ఇంటిది కాకపోవడంతో అది ఆ తాళంలో ఇరుక్కుపోయింది.

అప్పుడు సోమయ్య కంగారుగా దాన్ని బలంగా అటు, ఇటు లాగేసరికి అది విరిగి సగం ముక్క తాళంలోనే ఇరుక్కుపోయింది. దాంతో అతడికి భయం వేసింది. రామయ్య వస్తే జరిగినది గ్రహించి తనను దండిస్తాదని భయపడ్డాడు. 

సోమయ్య ఉంటున్న ఇంటికేమో తాళం వేసుంది. ఇంకో మార్గంలేక సామానంతా వదిలేసుకుని, నమ్మి స్థానం ఇచ్చిన రామయ్యను మోసం చేయాలనుకున్న తనకు తగిన శాస్తి జరిగిందనుకుంటూ ఊరొదిలి వెళ్ళిపోయాడు.

Also, Read Panchatantra Stories In Telugu With Moral • పంచతంత్ర కథలు

Moral Of The Story (కథ యొక్క నీతి):

"మనల్ని నమ్మిన వారిని మోసం చేయాలని చూడకూడదు"

 "We should not look to deceive those who believe in us"

*** ఇవి కూడా చదవండి ***

Short Stories in Telugu With Moral

కూతురు కొడుకు కంటే తక్కువ కాదు

Top 10 Stories In Telugu With Moral


చిన్న నీతి కథలు మీకు నచ్చినట్లయితే కచ్చితంగా షేర్ చేయండి, కింద కనిపిస్తున్న ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, మరియు ఇతర సోషల్ మీడియా ద్యారా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. 


Post a Comment

Previous Post Next Post