పిచ్చుకల గుణపాఠం: నీతి కథ Moral Stories in Telugu

పిచ్చుకల గుణపాఠం నీతి కథ  Moral Stories in Telugu

పిచ్చుకల గుణపాఠం Moral Stories in Telugu [ నీతి కథ ]

ఒక అడవిలో పిచ్చుక మరియు తన భర్త కలిసి చెట్టు మీద నివసించేవి. పిచ్చుక రోజంతా తన గూడులో కూర్చుని గుడ్లు పొదిగేది, మరియు భర్త పిచ్చుక  ఆహరం వెతికి తెచ్చేది. ఆలా రెండు పిచ్చుకలు చాల సంతోషంగా ఉన్నాయి,  ఆడ పిచ్చుక గుడ్లు పొదుగుతుంది

ఒక రోజు పిచ్చుక యొక్క భర్త ఆహరం వెతుకుతూ తన గూడు వదిలి వెళ్లింది. ఆడ పిచ్చుక తన గుడ్లను చూసుకుంటుంది. అప్పుడే, ఒక ఏనుగు పిచ్చి పట్టినట్లు అక్కడికి వచ్చి చెట్టు కొమ్మలను విరగకొట్టడం ప్రారంభించింది. ఏనుగు 'పిచ్చుక గూడు' ను కింద పడేసింది, దాని గుడ్లన్నీ పగిలిపోయాయి. పిచ్చుకకు చాలా బాధగా అనిపించింది. 

పిచ్చుక ఏనుగుపై చాలా కోపంగా ఉంది. పిచ్చుక భర్త తిరిగి వచ్చినప్పుడు, ఏనుగు విరగకొట్టిన కొమ్మపై పిచ్చుక కూర్చుని, ఏడుస్తూ కనిపించింది. పిచ్చుక జరిగిన సంఘటనను మొత్తం తన భర్తకు వివరించింది, ఇది విని తన భర్తకు కూడా చాలా బాధగా అనిపించింది. ఆ అహంకార ఏనుగుకు గుణపాఠం నేర్పించాలని రెండు పిచ్చుకలు నిర్ణయించుకున్నాయి. 

రెండు తమ స్నేహితులలో ఒకరైన వడ్రంగిపిట్ట వద్దకు వెళ్లి మొత్తం విషయం ఆ పక్షికి చెప్పాయి. వడ్రంగిపిట్ట  ఏనుగుకు తప్పకుండ గుణపాఠం చెప్పాలి అని అంది. వడ్రంగిపిట్ట కు ఇద్దరు స్నేహితులు ఉన్నారు, వారిలో ఒకరు తేనెటీగ మరియు కప్ప. ముగ్గురు కలిసి, ఏనుగుకు ఒక పాఠం నేర్పించాలని ఒక ప్లాన్ వేశాయి, ఆ ప్లాన్ పిచ్చుకలకి  చాల బాగా నచ్చింది

మరుసటి రోజు: తాము వేసుకున్న ప్లాన్ లో భాగంగా, తేనెటీగ మొదట ఏనుగు చెవిలో మధురమైన శబ్దం చేయడం ప్రారంభించింది. తేనెటీగ యొక్క మధురమైన శబ్దంలో ఏనుగు లీనమై పోయినప్పుడు, వడ్రంగిపిట్ట వచ్చి ఏనుగు తొండంపై పొడిచింది.

ఏనుగు నొప్పితో అరిచింది, ఆపై కప్ప తన కుటుంబంతో వచ్చి ఏనుగు దగ్గర అరవడం మొదలుపెట్టాయి. ఏనుగు కు ఒక్కసారిగా ఎం చేయాలో అర్థం కాలేదు. అది భయంతో అక్కడి నుండి దూరంగా అడవిలోకి పారిపోయింది. ఇంకెప్పుడు అక్కడికి తిరిగి రాలేదు. 

ఈ  విధంగా, పిచ్చుకలు  ఒక తేనెటీగ, వడ్రంగిపిట్ట మరియు ఒక కప్ప సహాయంతో ఏనుగుపై ప్రతీకారం తీర్చుకున్నాయి. 

కథ యొక్క నీతి: 

ఐకమత్యంగా మరియు తెలివిని ఉపయోగించడం ద్వారా పెద్ద సమస్యలను ఓడించవచ్చని ఈ కథ మనకు నేర్పుతుంది.


Post a Comment

Previous Post Next Post