అత్యాశ కుమారుడు [ Telugu Moral Story ]
Telugu Moral Story: ఒక ఊరిలో హరిదత్ అనే బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. అతనికి పొలాలు ఉన్నాయి, కానీ పొలం ద్వారా పంటలు పెద్దగా పండటం లేదు. ఒక రోజు హరిదత్ తన పొలంలో ఒక చెట్టు కింద నిద్రిస్తున్నాడు. ఆ చెట్టు కింద ఒక పుట్ట ఉంది.
హరిదత్ కళ్ళు తెరిచిన వెంటనే, పుట్ట దగ్గర ఒక పాము పడగ విప్పి ఉండటం అతను చూశాడు. బ్రాహ్మణుడు అది సాధారణ పాము కాదు, దేవత అని గ్రహించాడు. ఆ రోజు నుండి ఆ నాగదేవతను పూజించాలని బ్రాహ్మణుడు నిర్ణయించుకున్నాడు.
హరిదత్ లేచి పాము కోసం పాలు తెచ్చాడు . అతను పాముకు ఒక మట్టి పాత్రలో పాలు పోశాడు, పాము ఆ పాలను తాగింది. హరిదత్ పాముతో, "ఓ నాగదేవత! ఈ రోజు వరకు, నేను నిన్ను ఒక సాధారణ పాము అని అనుకున్నాను, నన్ను క్షమించు, అలాగే, నీ దయతో నాకు చాలా డబ్బును, జ్ఞానం ఇవ్వమని" పాముకు మొక్కుతాడు, తరువాత హరిదత్ తన ఇంటికి తిరిగి వచ్చాడు.
మరుసటి రోజు అతను తన పొలానికి చేరుకున్నప్పుడు, అతను నిన్న పాముకు పాలు పోసిన పాత్రలో బంగారు నాణెం ఉండటం చూశాడు. హరిదత్ ఆ నాణెం ను తీసుకున్నాడు.అప్పటినుండి హరిదత్ ప్రతిరోజూ పాముకు పాలు పోసి పూజించడం మొదలుపెట్టాడు మరియు పాము అతనికి ప్రతిరోజూ ఒక బంగారు నాణెం ఇవ్వడం మొదలుపెట్టింది.
కొన్ని రోజుల తరువాత హరిదత్ ఒక పని మీద ఇతర నగరానికి వెళ్ళవలసి వచ్చింది, కాబట్టి, తన కొడుకును పొలానికి వెళ్లి పాము దేవునికి రోజు పాలు పోయమని చెప్పాడు. తన తండ్రి చెప్పినందుకు హరిదత్ కొడుకు పొలానికి వెళ్లి పాము పాత్రలో పాలు పెట్టాడు.
మరుసటి రోజు ఉదయం అతను పాముకు పాలు పోయడానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఒక బంగారు నాణెం ఉండటం చూశాడు. హరిదత్ కొడుకు బంగారు నాణెం తీసుకొని ఈ పాము పుట్టలో ఖచ్చితంగా బంగారం నిధి ఉందని మనసులో ఆలోచించడం మొదలుపెట్టాడు.
అతను పాము యొక్క పుట్టను తవ్వాలని నిర్ణయించుకున్నాడు, కాని అతనికి పాము అంటే చాలా భయం. "పాము పాలు తాగడానికి వచ్చిన వెంటనే, కర్రతో పాము తలపై కొట్టాలని, దానితో పాము చనిపోతుందని హరిదత్ కుమారుడు ప్లాన్ వేసుకున్నాడు."
పాము చనిపోయిన తరువాత, నేను హాయిగా పుట్టను త్రవ్వి, దాని నుండి బంగారాన్ని తీసుకొని ధనవంతుడిని అవుతాను. అని ఆలోచిస్తూ చాల ఆనందంగా ఇంటికి వెళ్ళాడు.
మరుసటి రోజు బాలుడు అనుకున్నట్లుగానే చేసాడు. కాని, అతను పాము తలపై కర్రతో కొట్టిన వెంటనే, పాము చనిపోలేదు పాముకు, చాల కోపం వచ్చింది. పాము కోపంతో తన విషపూరితమైన దంతాలతో బాలుడి కాలును కరిచింది.
దానితో బాలుడు అక్కడే మరణించాడు. హరిదత్ తిరిగి వచ్చినప్పుడు, జరిగిన విషయం తెలుసుకొని చాలా బాధపడ్డాడు.
Moral of The Story:
దురాశ వలన వచ్చే ఫలితం ఎల్లప్పుడూ చెడ్డగా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడూ అత్యాశ పడకూడదు .
మన దగ్గర ఉన్నదానితో, సంతృప్తి చెందాలి మరియు ఎల్లప్పుడూ కష్టపడి పనిచేస్తూ ఉండాలి, దాని వలన మంచి ఫలితం లభిస్తుంది.