నిజాయితీ - Moral Story In Telugu About Honest

Best Moral Story in Telugu, This story that everyone should read Good Moral Story We will learn through this story that every man should work Honestly. This new moral story is best for children to read in Telugu

Moral Story In Telugu About Honest - నిజాయితీగ పని చేయాలి

Honest Moral Story In Telugu: ఒక గ్రామంలో రామరాజు  అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను ఇంటి పెయింటింగ్ పని  చేసేవాడు. తను పనిని చాల నిజాయితీగ మరియు కష్టపడి చేసేవాడు. కష్టపడి పనిచేసిన తరువాత కూడా అతనికి చాలా తక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు.

ఆ సంపాదనతో అతను రెండు పూటలు మాత్రమే తినగలిగేవాడు. అతను మరింత కష్టపడాలి అని అనుకున్నాడు. ఒక రోజు గ్రామ జమీందార్ రామరాజు ని పిలిచాడు. రామరాజు జమీందార్‌ వద్దకి వెళ్లాడు. 

జమీందార్ రామరాజు తో " నా దగ్గర ఒక పడవ వుంది దానికి నీవు పెయింట్ వేయాలి, అది కూడా ఈరోజే వేయాలి" అని జమీందార్ అన్నారు. రామరాజు జమీందర్‌తో కలర్ వేస్తానని చెప్పాడు. దానికి ఎంత డబ్బులు కావలి అని జమీందార్ రామరాజు‌ను అడిగాడు, కలర్ వేయడానికి 1000 రూపాయలు తీసుకుంటానని రామరాజు చెప్పాడు. 

దీని తరువాత జమీందార్ రామరాజును తీసుకెళ్లి నది ఒడ్డున ఉన్న పడవను చూపించాడు. రామరాజు తన ఇంటి నుండి రంగులను తెచ్చి పడవను మంచిగా కడిగి రంగులు వేయడం ప్రారంభించాడు. అతను రంగులు వేస్తున్నప్పుడు అతను పడవలో ఒక రంధ్రం చూశాడు.

[ BEST ] Moral Story In Telugu About Honest  నిజాయితీ

నేను దానిపై ఇలాగే పెయింట్ చేస్తే, ఈ పడవ మునిగిపోతుందని అతనికి అనిపించింది. కాబట్టి మొదట అతను ఆ రంధ్రంని మూసివేసి దానిపై పెయింట్ చేశాడు. పడవకు కలర్ వేయడం పూర్తయ్యాక, అతను పడవను చూపించడానికి  జమీందార్ని తీసుకువచ్చాడు.

జమీందార్, వచ్చి పడవను చూసిన తరువాత, అతనికి మరుసటి రోజు డబ్బు ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత రామరాజు తన ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు, జమీందార్ యొక్క  భార్య మరియు పిల్లలు నది లో సరదాగా తిరగడానికి పడవలో ఎక్కి వెళ్లారు. 

జమీందార్ యొక్క పనివాడు సాయంత్రం ఇంటికి వచ్చి, "ఇంట్లో ఎవ్వరు కనిపించడం లేదు ఎక్కడికి వెళ్లారు అందరు" అని అడిగాడు. పడవ ఎక్కి నదిలో సరదాగా గడపడానికి వెళ్లారని జమీందార్ పనివాడితో అన్నాడు. ఆ పడవలో రంధ్రం ఉందని పనివాడు జమీందార్‌తో చెప్పాడు.

ఆ మాటలు విన్నాక భూస్వామి చాలా భయపడ్డాడు. కొద్ది సమయం తర్వాత, జమీందార్ భార్య మరియు పిల్లలు సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారు. పడవకు రంగులు వేసేటప్పుడు రామరాజు ఆ రంధ్రం మూసి ఉంటాడని అతనికి అర్థమైంది. 

ఆరోజు సాయంత్రం, రామరాజు తన డబ్బు తీసుకోవడానికి జమీందార్ ఇంటికి వచ్చాడు, జమీందార్ అతనికి డబ్బు ఇచ్చాడు. రామరాజు డబ్బును లెక్కపెట్టాడు అందులో 5,000 రూపాయలు వున్నాయి. జమీందార్ గారు మీరు పొరపాటున నాకు ఎక్కువ డబ్బు ఇచ్చారని రామరాజు అన్నాడు. 

కాదు, నీవు చేసిన పనికి ప్రతిఫలం అని జమీందార్ అన్నాడు. నీవు  పడవలో కలర్ వేసేటప్పుడు  రంధ్రం మూసివేసి . ఈరోజు నా కుటుంబం ప్రాణాలను కాపాడవురామరాజు ఆ డబ్బుని తీసుకొని ఇంటికి వెళ్లాడు. రామరాజు చాలా సంతోషంగా ఉన్నాడు.

Also, Read Panchatantra Stories In Telugu With Moral • పంచతంత్ర కథలు

Moral Of The Story (కథ యొక్క నీతి):

నిజాయితీతో, కష్టపడి పని చేస్తే ఫలితం ఎల్లప్పుడూ బాగుంటుంది.

Also Read: 10 Stories In Telugu With Moral

Also, Read Clever fish Telugu Moral Story For Kids

Also, Read Moral Stories In Telugu ఇద్దరు స్నేహితులు

Also, Read Clever Crow Moral Stories In Telugu

Post a Comment

Previous Post Next Post