36+ అక్బర్ బీర్బల్ కథలు • Akbar Birbal Stories In Telugu

Akbar Birbal Telugu Stories | అక్బర్ బీర్బల్ తెలుగు కథలు

Akbar Birbal stories in Telugu: Akbar was one of the greatest of the Mughal emperors who ruled India. The history of Emperor Akbar is very rich in religious harmony. When Akbar was born, his father Humayun lost his kingdom and was in the jungle. In 1542, on the occasion of the birth of his son Akbar, Emperor Humayun distributed his spice musk to all his lovers. He hopes his son’s fame will spread across the country like musk scents.

తెలుగులో 36+ అక్బర్ బీర్బల్ కథలు | Akbar Birbal Kathalu In Telugu

Akbar gained a good name in the country as his father had hoped. Akbar was a man of good harmony, a lover of comedy. His court was effective in celebrating every day with scholars, poets, nobles, and employees. Birbal is a master of punctuality, maneuver, and entertainment in Akbar's court. Through him, Akbar's fame spread to other countries.

Birbal was born into a simple family - losing his parents at an early age. Close relatives joined and played. Birbal has had good wisdom in education since infancy. Enthusiasm. Demonstrating ingenuity. He spoke politely, politely, and softly to everyone. Because of these virtues, Birbal speaks in a way that entertains others. Good timing has been stupid since infancy. He speaks tactfully to those in front of him and persuades them.
Read Remain Story in Telugu. We have provided 36+ Akbar Birbal Stories In Telugu.

Akbar Birbal Telugu Stories-అక్బర్ బీర్బల్ తెలుగు కథలు

1) అక్బర్‌ - బీర్బల్‌ పరిచయం *

భారతదేశాన్ని పరిపాలించిన మొగలాయి చక్రవర్తులలో అక్బర్‌ గొప్పవాడు. మతసామరస్యంలో అక్బర్‌ చక్రవర్తి చరిత్ర చాలా గొప్పది. అక్బరు పుట్టినప్పుడు, తండ్రి హుమయూన్‌ రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో ఉన్నాడు. 1542 లో హుమయూన్‌ చక్రవర్తి తన కుమారుడు అక్బరు జన్మించిన సందర్భంలో తన వద్దవున్న సుగంధద్రవ్య కస్తూరిని తన వారందరికి పంచి పెట్టాడు. తన కుమారుని కీర్తి ప్రతిష్టలు కస్తూరి సువాసనల వలె దేశమంతటా వ్యాపించాలని ఆశించాడు.

తండ్రి ఆశించినట్లే అక్బరు దేశంలో మంచి పేరును పొందాడు. అక్బరు మంచి సామరస్యము కలిగిన వ్యక్తి, హాస్య ప్రియుడు. అతని దర్భారు ప్రతిరోజు పండితులతో, కవులతో - సామంతులతో, ఉద్యోగులతో ఎంతో వేడుకగా సమర్థవంతంగా ఉండేది. సమయస్ఫూర్తి, యుక్తి - వినోదము అందించడంలో అక్బరు దర్భారులో బీర్బల్‌ మంచి చతురుడు. అతనివలన అక్బరు కీర్తి దేశదేశాల వ్యాపించింది.

బీర్బల్‌ సాధారణ కుటుంబములో పుట్టాడు - చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. దగ్గర బంధువులు చేరదీసి పోషించారు. పసితనం నుండే బీర్బల్‌ విద్యాబుద్దులందు మంచి వివేకము. ఉత్సాహము. చాతుర్యము ప్రదర్శిస్తుండేవాడు. అందరితో పొత్తుగా, వినయముగా మృధువుగా మాట్లాడుతుండేవాడు. ఈ మంచిగుణముల వల్ల బీర్బల్‌ ఎదుటి వారికి వినోదము కలిగేలా మాట్లాడేవాడు. మంచి సమయస్ఫూర్తి పసితనం నుండే అబ్బింది. ఎదుటవారితో యుక్తిగా మాట్లాడి వారిని మెప్పించేవాడు.

మహామేధావియైన బీర్బల్‌ వివేక విద్యాసంపన్నుడై ఉన్నప్పటికి, దరిద్రముతో చాలా బాధపడుతుందేవాడు. గ్రామములోని పెద్దలు అతనినీ అక్బరు వద్దకు వెళ్ళి ఆశ్రయించమని ప్రోత్సహించేవారు. బీర్బల్‌ ఢిల్లీకి బయలుదేరి అక్బరుకోటకు వెళ్ళాడు. రాజభటులు అతనిని కోటలోనికి వెళ్ళనియ్యలేదు.

తిరిగి తిరిగి ఒకనాడు కొన్ని గుడ్డలను పెద్దమూటగ కట్టుకొని కోట ముందుకు వెళ్ళాడు. “ఓయీ!కట్టుగుడ్డయినా లేని నిన్ను లోనికి పంపించం”అన్నారు భటులు. “అయ్యలారా! ఆగ్రహించకండి. నేను నిరుపేదనే కాని రాజుగారికి మేలు చేయగల విషయమొకటి చెప్పవలెనని వచ్చితిని.

మీరు లోనికి పంపించినచో ప్రభుదర్శనం చేసుకుని విషయం చెప్పి వారి మెప్పును పొందగలవాడను. మెచ్చుకున్న ప్రభువులు నాకిచ్చు పారితోషికములో సగము మీకిచ్చెదను. నన్ను లోనికి అనుమతించండి” అని వేడుకున్నాడు.

“సరే” అని భటులు బీర్బల్‌ని లోనికి వదిలిపెట్టారు. కొంతదూరం వెళ్ళగా రెండవ దర్వాజా వద్ద భటులు వానిని అడ్డగించారు.“తనకు వచ్చే బహుమతిలో సగం మొదటి దర్వాజావారికిస్తానని వాగ్జానం చేసాను. మిగలిన దానిలో సగభాగం మీకు ఇచ్చుకుంటాను” అని బ్రతిమలాడి బీర్బల్‌ ఆ ద్వారం దాటి మరికొంత దూరంలో ఉన్న మూడవ ద్వారానికి చేరుకున్నాడు.

వాళ్ళుకూడా బీర్బల్‌ను అడ్డుకున్నారు. వారికి విషయం చెప్పి “మిగిలిన నాల్టవవంతు పారితోషికం మికుఇస్తాను” అని ఆ మూడవ ద్వారం వద్ద గల భటులకు వాగ్దానం చేసి పాదుషా వారి దర్భారు లోనికి ప్రవేశించాడు. అక్కడి భటులు  వానిని అవతలకు గెంటి వేయభోయారు. అక్బరు ఆ అలికిడి విని, అతని వాలకాన్ని చూచి చిరాకు పడి “వందకొరడాదెబ్బలు కొట్టి వానిని అవతలకు తరిమివేయ” మని ఆజ్ఞాపించాడు.

భటులు వానిని కొరడాలతో కొట్టబోగా “అయ్యలారా! కంగారుపడకండి. పాదుషావారు నాకు ఇచ్చే దానిలో సగం మొదటిదర్వాజావారికి మిగిలిన దానిలో నగము రెండవ దర్వాజా వద్డ ఉన్నవారికి, మిగిలిన దానిని మూడవ దర్వాజావారికి పంచి నన్ను మాట నిలబెట్టుకో నిన్వండి” అని వేడుకున్నాడు. పరిస్థితిని, విషయాన్ని, తెలియజెప్పిన బీర్బల్‌ విజ్ఞతను గమనించిన అక్బరు వానిని మన్నించి, నౌకరులను శిక్షించి బీర్బల్‌కు తన ఆస్థానంలో స్వేచ్చగా వచ్చేపోయే అనుమతిని ఇచ్చాడు.

కాలం గడుస్తూ ఉంది. బీర్బల్‌ తరుచుగా పాదుషా వారి దర్శనం చేనుకుంటుండేవాడు. అక్బర్‌ పాదుషావారికి తమ చిత్రపటాన్ని చిత్రీకరింపజెయ్యాలన్నా ఆసక్తి కలిగింది. ఒకనాడు దర్భారులో తమ అభిలాషను ప్రకటించారు.. యధాతధంగా తమ చిత్రాన్ని వేసిన ఉత్తమ చిత్రకారునికి వెయ్యి బంగారు నాణేలు ఇస్తామని చిత్రాన్ని నెల రోజుల తర్వాత ఫలానా తేదీనాడు దర్భారుకు తెచ్చి తమకు సమర్పించాలని ప్రకటించారు పాదుషా.

దేశంలోగల చిత్రకారులంతా తమ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి అక్బరు వారి చిత్రాన్ని చిత్రీకరించారు. నిర్ణీత రోజున చిత్రకారులంతా తాము చిత్రీకరించిన చిత్రాలను పాదుషావారికి చూపించారు. ఏ ఒక్కరువేసిన చిత్రం ప్రభువుల మనస్సును మెవ్పించలేదు. ఆ వరునలో బీర్బల్‌ ముందుకువచ్చి “జహాపన! దీనిని చిత్తగించండి. 'ముమ్మూర్తులా మీకు సాటీగా ఉంటుందని” గుడ్డతో చుట్టబెట్టిన దానిని ప్రభువు ముందుంచాడు. “బీర్బల్‌ నీకు చిత్రలేఖనం కూడ వచ్చునా?నీవు వీరివలనే అంతమాత్రంగా చిత్రీకరించేవా?” అని ప్రశ్నించి ఏది చూపించమన్నారు అక్ఫర్‌పాదుషా.

బీర్బల్‌ నిలువుటద్దాన్ని క్బర్ పాదుషా ముందుంచాడు. “చూడండి ప్రభూ! కొంచెంకూడా తేదా ఉండదన్నాడు." అద్దంలోని తన ప్రతిబింబాన్ని చూసి బీర్బల్‌ ఆంతర్యాన్ని గ్రహించాడు. దేవుని సృష్టికి ప్రతిసృష్టి చేయడం సాధ్యపడే విషయం కాదు. ఎంతటి పనివాడికైనా ఏదో ఒక లోపం ఉండి తీరుతుంది. ఈ విషయం తెలిసొచ్చేలా చేసిన బీర్భాల్‌ను అభినందించిన మొగలాయి చక్రవర్తి అక్బర్‌, ఆతడిని తన దర్బార్‌ విదూషకుడుగా నియమించుకున్నాడు.

2) నక్షత్రాల లెక్క *

అక్బర్‌ ఒకనాడు ఆరుబయటగల తన పాన్పుపై వెల్లకిలా పడుకున్నాడు.

ఆకాశంలో గల నక్షత్రాలు మిలమిలలాడుతూ ఆయన హృదయాన్ని పరవశింపచేసేయి. ఈ చక్కని చుక్కలు ఎన్ని ఉంటాయి అన్న ఆలోచన కలిగింది. ఆలోచించి ఆలోచించి ఆ మర్నాడు దర్బారులో మింటగల చుక్కలు లెక్క చెప్పగలవారికి రత్నాలు, రాసులు బహుమానం ఇస్తామని ప్రకటించాడు.

ఎవరికి ఎంతమాత్రం సాధ్యంగాని ఈ లెక్కకు చాలామంది నిరాశచెందారు. నక్షత్రాల లెక్క చెప్పవలసిన రోజున అద్భుతమైన ఈ నక్ష్మత్రాల లెక్క ఎన్నికోట్లో తెలుసుకోవాలన్న ఆసక్తితో అనేకమంది దర్బారుకు చేరుకున్నారు. బీర్బల్‌ మాత్రం రాలేదు. అతని రాకకై ఎదురు చూడగా చూడగా. కొంతసేపటికి, ఒకమూటను, పట్టుకొని దర్బారుకు వచ్చి, మూటను సభామధ్యంలో ఉంచాడు.

“ప్రభువులు క్షమించాలి. నక్షత్రాలు లెక్కపెట్టడం పూర్తయ్యేసరికి ఆలస్యమయింది.” అన్నాడు బీర్బల్‌. “ఏమిటి? నక్షత్రాలను లెక్కపెట్టావా” అనిఅడిగాడు అక్బర్‌పాదుషా. “చిత్తం, లెక్క ఇన్ని అనిచెప్పడం. అంకెల్లో సాధ్యపడనందువల్ల నక్షత్రానికొక ఆవగింజ వంతున లెక్కపెట్టి ఆ ఆవాలను ఈ సంచిలో వేయించి ఇక్కడకు తెచ్చాను. గణికులను వినియోగించి ఆవాలు లెక్కపెట్టించండి. అవి ఎన్ని ఉంటే అన్ని నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయన్నాడు”. సాధ్యంకాని పనిని అది అసాధ్యమని యుక్తిగా చెప్పిన బీర్బల్‌యుక్తికి, సముచిత ఆలోచనకు ముగ్గుడైన అక్బర్‌, ఆనాటినుండి బీర్బల్‌ను తన ఆంతరంగిక విదూషకునిగా నియమించాడు.

3) అరచేతిలో వెంట్రుకలు *

కాలం గడచిపోతున్నది. అక్బర్‌ - బీర్బల్‌ల సన్నిహిత్యం మరింతగా పెరిగింది. బీర్బల్‌ సమయోచిత విజ్ఞానానికి, సామరస్య పూర్వకమైన విధానానికి అక్బర్‌ ఎంతగానో సంతృప్తి చెందుతుందేవాడు. ఒకనాడు పాదుషా వారికి బీర్బల్‌తో హాస్యమాడాలనిపించింది. నిండు సభలో బీర్బల్‌ను ఉద్దేశించి “బీర్బల్‌ మాకొక సందేహం అది నువ్వే తీర్చగలవని నా విశ్వాసం” అన్నాడు. 

“ప్రభువులకు సందేహమా, అది ఈ సామాన్య విదూషకుడు తీర్చడమా? అదేమిటో శలవియ్యండి జహాపనా. నాకు తోచిన మేరకు మీ సందేహాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తా” నన్నాడు. 

మరేంలేదు. మనందరకు తెలుసున్న విషయమే - అది ఎందువల్ల జరుగుతున్నది తెలియక నిన్నడుగుతున్నాను. .అన్న పాదుషాను విషయం తెలియజెప్పవలసిందని అడిగాడు బీర్బల్‌. ఏమున్నది. మన శరీరము అంతటా వెంట్రుకలు కొంతగాక కొంతయినా ఉన్నాయి. కాని నా అరచేతుల్లో ఎందువల్ల వెంట్రుకలు లేవన్నది మా సంశయము అన్నాడు.

“ఏమున్నది ప్రభూ! మీరుచేసే దానధర్మాల వల్ల తమ అరచేతులలో వెంట్రుకలు మొలవడం లేదు”అన్నాడు. యుక్తీ యుక్తమైన జవాబుకు ఆనందించిన అక్బరుకు బీర్బల్‌ను తికమకపెట్టాలనిపించి “మరి నీ అరచేతిలో ఎందుకు మొలవలేదని” ప్రశ్నించాడు. “ఏమున్నది ప్రభూ మీరిచ్చే కానుకలు, ధర్మాలు అందుకోవడంలో అరచేతులు అరిగిపోయి వెంట్రుకలు మొలవడం వీలుగాక అట్లాగే ఉండిపోయా” యన్నాడు.

ఆ సమాధానాలకు పాదుషా - సభికులు ఎంతగానో ఆనందించి బీర్బల్‌ జ్ఞానాన్ని ఎంతగానో ప్రశంశించారు.

4) మామిడిపళ్ళ విందు  *

అక్బర్‌ గారి అంతఃపురానికి స్వేచ్చగా వచ్చీపోయే సాన్నిహిత్యం బీర్బల్‌కు ఉండేది. యధాప్రకారం ఒకనాడు బీర్బల్‌ అంతఃపురానికి రాబోయేసరికి అక్బర్‌ పాదుషా మామిడిపళ్ళను ఆరగిస్తున్నారు. వచ్చిన బీర్బల్‌ను అప్యాయంగా ఆహ్వానిస్తూ క్బరు వారు “రావయ్యా బీర్బల్‌! మంచి సమయానికి వచ్చావు. మామిడిపళ్ళు మంచి పసందుగా ఉన్నాయి. కూర్చో తిందువు గాని” అన్నారు. అసలే మామిడిపళ్ళు. మంచిరుచిగా ఉన్నాయని ప్రభువు అంటున్నారు. తనకు కూడా వాటిపట్ల మోజు కలిగింది బీర్బల్ కు.

ఇద్దరు కూర్చుని పళ్ళను ఆరగిస్తున్నారు. అక్బర్‌ పాదుషావారు పళ్ళరసాన్ని పీల్చి టెంకలను బీర్బల్‌ ముందున్న టెంకలలో వడవేయసాగారు. మరికొంత సేపటికి “యేమయ్యా బీర్బల్‌ అంత ఆకలితో ఉన్నావా - చాలా ఎక్కువ కాయలు తిన్నట్టున్నావు” అని బీర్బల్‌ ముందున్న టెంకలను చూపించి చమత్కరించారు.

 “ప్రభూ! నేను ఆకలితో ఉన్న మాట వాస్తవం. అదీగాక పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి. నేనుకాస్త అతిగానే పళ్ళను ఆరగించానన్నాడు. మరికొన్ని వళ్ళు తిను” అన్నాడు అక్బర్‌ పాదుషా. వ్రభూ నాకు కడుపు నిండిపోయింది. భ్రాంతి తీరిపోయింది. ఇంక ఒక్క పండును కూడా పీల్చలేను. కాని తమరు నాకన్నా ఆకలితో ఉన్నట్టున్నారు. నేను టెంకలనయినా వదిలి వేసాను. తమరు ఒక్క టెంకనుకూడా వదలకుండా టెంకలను సైతం ఆరగించారు.ఆకలితో ఉన్నట్టున్నారు తమరే నాలుగుపళ్ళు తినండి” అని చమత్కరించాడు బీర్బల్‌.

బీర్బల్‌ చమత్కారానికి ఆనందించి, తానుతిన్న పళ్ళెంలోని టెంకలను బీర్బల్‌ విస్తరిలో పడవేసినందుకు సిగ్గుపడ్డాడు. తన అవివేకాన్ని సున్నితంగా. దుయ్యబట్టిన బీర్బల్‌ను అభినందిచాడు.

5) అబద్దం యొక్క బలం *

ఒకానొకప్పుడు అక్బరుపాదుషా వారి దర్భారునందు రాజకీయ వ్యవహారములు మీమాంసలు, నిర్ణయాలు ముగిసిన తరువాతను - సభలో వినోద ప్రసంగాలు చోటు చేసుకున్నాయి. క్రమక్రమంగా సభాసదుల ప్రసంగాలు, నిజం - అబద్ధం ఏది బలమైనట్టిది అన్న మీమాంసకు చేరుకున్నది: వాద ప్రతివాదాల అనంతరం నిజమే బలమైనది, స్థిరమైనది అని నిర్దారణకొచ్చారు.

బీర్బల్‌ మాత్రం అబద్దమే బలమైనది అని వాదించాడు - అక్బరు పాదుషావారు నిరూపించమన్నారు. సమయాన్ని అనుమతిస్తే అబద్దం ఎంత బలమైనదో నిరూపిస్తానన్నాడు. ఆరుమాసాలు గడువిస్తున్నాను. నిరూపించు లేదంటే సభవారి నిర్ణయానికి విరుద్ధంగా నిర్ణయించిన నీకు శిరచ్చేదమై శిక్ష అన్నారు. “చిత్తం” అని అంగీకరించాడు బీర్బల్‌.

కాలం గడచిపోతున్నది. ప్రజలు, పాదుషావారు ఆ విషయాన్నే మర్చిపోయారు.

ఒకనాడు ఒక వృద్ధ వేశ్య మనవరాలితో రాజుగారి దర్శనానికి వచ్చింది. పాదుషావారు నా మనవిని చిత్తగించి, మీ చిత్తాన్ని నేను చెప్పే విషయం మీద కేంద్రీకరించాలి. మీకు గొప్ప మేలు కలుగుతుంది. ఈ నా మనమరాలు ఇటీవలనే పుష్పవతి అయ్యింది.

పేరంటము, ఆశీస్సులు పూర్తయిన నాటి రాత్రి దేవేంద్రుడు నాకు కలలో అగుపించి, హే, హేమాంగీ నీ మనువరాలు నాకొరకై పుట్టింది. నేను ఈ నాటికి ౩ నెలల అనంతరం ఆమెను ఏలుకొనుటకు వన్తున్నాను. పాదుషావారి దర్శనం చేనుకుని ఏకాంత మందిరం ఏర్పాటుచెయ్యమని కోరుకుని, నీ మనవరాలిని అందుంచి నా రాక్షకై నిరీక్షించు. పరులెవ్వరి ప్రాపకానికి ఆమెను వినియోగించకు. మూడునెలలనాటికి  శ్రావణమాసం వస్తున్నది. ఆ మాసంలోని పూర్ణిమరోజు అర్ధరాత్రి ఏకాంతర మందిరానికి నేను వస్తాను. ఇందుకు యే విధమైన మార్పు ఉండబోదు. అని నన్ను హెచ్చరించాడు. ఆ విషయం తమకు మనవి చేసుకుని ఏకాంతర మందిరం ఏర్పాటు చేయగలందులకు వేడుకుంటున్నాను అన్నది.

ఇంతకుముందెన్నడు యేనాడు జరగని విశేషం ఇది. మానవకాంతను దేవేంద్రుడు ఆశించడం ఆమెకొరకు తాను భువికి ఫలానా రోజున వస్తాననడం అబ్బురంగా ఉన్నది. నిరీక్షిస్తే నిజానిజాలు తెలుస్తాయని పాదుషావారు యోచించి ఆమెకోరిన ప్రకారం ఆమె కుమార్తెకు ఏకాంతర మందిరం కట్టించి, ఆ ఇచ్చిన భవనంలో తన కుమారైను ప్రవేశపెట్టి పాదుషా వారిని రాజధాని ప్రముఖులను, శ్రావణశుద్ధ సప్తమీ శనివారంనాడు జరుగబోయె తనకుమార్తె కన్నెరికపు మహోత్సవానికి వచ్చి, దేవేంద్రుల వారి దర్శనం చేసుకుని, కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసినదని ఆహ్వానించింది.

కాలంగడచింది. శ్రావణ శుద్ధపౌర్ణమి శనివారం అర్ధరాత్రి దేవేంద్ర ఆగమన సందర్శనాభిలాషులై పాదుషా వారు ప్రముఖులు కన్నార్పకుండా నిరీక్షిస్తున్నారు. దేవేంద్రుడు రావడంగాని, మరేవిధమైన విశేషంగాని జరగలేదు. అక్బరుకు కోపం వచ్చింది.

భటులను పంపించి, నిద్రపోతున్న వేశ్యను ఆమె మనవరాలిని దర్భారుకు రప్పించాడు. ఇంతటి అబద్దమా - మమ్మల్నే మోసగించడమా అని ప్రశ్నించాడు. పాదుషావారు అనుగ్రహించాలి మిమ్మల్ని మోసగించడానికి నేను అబద్దం చెప్పలేదు. అబద్దం యొక్క బలం నిరూపించమని, తమరు బీర్బల్‌ గారిని ఆదేశించారు. అది బుజువు చేయడానికే బీర్బల్‌ గారు చేసిన పన్నాగమిది. అన్నీ తెలిసిన తమరే అబద్దాన్ని నమ్మారు. దాని శక్తికి దాసులయ్యేరు. మరి నిజం కన్నా అబద్దం బలం కలిగినట్టిదని నిరూపించడమె మాయీ పన్నాగం అని పలికింది.

నిజం నిలకడయినది. అబద్దానికికున్న బలం సామాన్యమైనది కాదు. అది ఎప్పుడైనా - ఎక్కడయినా - ఎవర్నయినా నమ్మించి విస్తరించగల బలము కలిగినట్టిదన్న సత్యాన్ని గుర్తించి అక్బర్‌ పాదుషావారు వేశ్యను, బీర్బల్‌ ను, సత్కరించారు.

6) దేవుడు చేయలేని పని *

ఒకనాటి రాత్రిపాన్పుపై పరున్న అక్బ రు పాదుషా వారికి ఒక ఆలోచన కలిగింది. దేవుడు సర్వసమర్దుడు. ఆయన చేయలేని పనంటూ ఉండదు. అట్లాగుననే తానుకూడా సర్వసమర్దుడు. తనకంటూ అసాధ్యమైన పనిలేదు. కాని సృష్టి మాత్రం తనకు అసాధ్యం. అలాగే, భగవంతునకు అసాధ్యమైన పనేదయినా ఉన్నదా అని అనుమానం కలిగింది. ఎంతగా ఆలోచించినా అక్బరుకు కలిగిన ఈ శంక తీరలేదు.

మర్నాడు దర్బారులో యుక్తీ యుక్తంగా బీర్బల్‌ను ప్రశ్నించాడు అక్బరు. “బీర్బల్‌ నేను సమస్తమైన పనులను చేయగలవాడను గదా! మరి నావలె భగవంతుడు అన్ని పనులు చేయగలడా? అని సగర్వంగా ప్రశ్నించాడు “చిత్తం తమరు సర్వసమర్దులు. దేవుడు మీకు సరిగాడు.. మీరు చేయగల పనులు కొన్ని ఆయన చేయలేడు. మీకున్న అవకాశం ఆయనకు లేదన్నాడు.

తనను అధికుడ్ని చేసిపలికిన బీర్బల్‌ పలుకులలో తాను చేసేది. భగవంతుడు చేయలేనిది యేమిటో తోచలేదు. తాను గ్రహించలేకపోయి విషయం వెల్లడి కాకూడదన్న ఆసక్తితో బీర్బల్‌ నాకు మాత్రమే సాధ్యమయ్యే పనేమిటో తోచక తికమక పడుతున్న సభికుల సంశయాన్ని తీర్చు” అన్నాడు. అక్బరు.

చిత్తం జహాపనా! సువిశాల ప్రపంచము అంతా ఆయనదే. తమకున్న సామ్రాజ్యమంతా తమదే. తమకు ఎవరి మీదనైనా అగ్రహంవస్తే తమరు, తమ రాజ్యాన్ని విడిచిమరెక్కడికైనా పొమ్మని శాసించగలరు. ఇది దేవునకు సాధ్యంకాదు - పరాయితావుకు తన జగత్తులో ఎక్కడికని పొమ్మనగలడు. జహాపనా! మీరుచేయగల ఈపని దేవుడు చేయలేడు అని ప్రభువుకు జ్ఞానోదయమయ్యేలా సున్నితంగా వివరించాడు బీర్బల్‌.

7) వంకాయ వంటి కూర *

ఒకప్పుడు అక్బర్‌ పాదుషావారి వంటవాడు 'లేత వంకాయలతో' మషాలాపెట్టి గుత్తివంకాయకూర చేశాడు. అది తిన్న పాదుషావారు. దాని రుచికి పరవశించి పోయేయారు. తాను తిన్న వంకాయకూరను గురించి బీర్బల్‌కు వర్ణించి, వర్ణించి, మరీ చెప్పాడు.

వంకాయవంటిది మరేదిలేదయ్యా అని వంకాయను ప్రశంసించాడు పాదుషావారు. నిత్యం ఆ కూరను వంటకాలలో మాకు చేసి వడ్డించమని చెప్పారు. అంతబాగున్న కూరను నేనింతవరకు తినలేదు. రేపు నువ్వుకూడా వచ్చి మాతోపాటు వంకాయ కూరను రుచి చూడవలసినదన్నాడు. ఆ మాటలకు బీర్బల్‌ పాదుషా వారిని ప్రశంసిస్తూ  జహాపనా! వంకాయ కూరగాయలలో సామ్రాట్టు అందువల్లనే “అల్లా” దానినెత్తిన టోపీపెట్టి గౌరవించాడు” అన్నాడు.

అక్బరు వారం పదిరోజుల పాటుపంకాయ కూరతోనే భోజసం చేయడం. వంటవాడు తన పనితనానికి పాదుషావారు సంతృప్తిని పొందుతుండడంతో, మరింత జాగ్రత్తగా, మరింత రుచికరంగా వంకాయకూర రకరకాలుగా పండి పాదుషావారికి వడ్డిస్తుండేవాడు. అలా పది పన్నెండు రోజులు, గడిచేసరికి 'పాదుషావారికి దురదలు సంభవించాయి. వైద్యులను పిలిపించి మందు ఇమ్మని, కారణం యేమై ఉంటుందన్నారు. రోజూ ఆహారంలో వంకాయకూరను  జతపర్చుకుని తినడమే కారణమన్నారు.

అక్బరు, బీర్బల్‌ను పిలిపించి వంకాయ సామ్రాట్టు కనుకనే అల్లాదానికి టోపీ పెట్టి మన్నించేడన్నావు. అది దుష్టమైన కాయగూరని వైద్యులు చెప్పారు ఇప్పుడేమంటావు. అన్నారు. అల్లాపెట్టిన టోపీతో విర్రవీగుతూ శృతిమించి ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నందువల్లనే అల్లా దాని నెత్తిన మేకును దిగవేశాడని ముచ్చికను వర్ణించాడు. నిన్న మంచిదన్నావు.

ఇప్పుడు చెడ్డదంటూ నీ మాటను సమర్దించుకుంటున్నావు యేమిటి అని అక్బరు బీర్బల్‌ను ప్రశ్నించాడు. “ప్రభూ! యధారాజా తధాప్రజా! ప్రభూ! అభిమతాన్ని మన్నించడం పౌరధర్మం. మీరు బాగుందన్నప్పుడు నేనూ బాగుందనే అన్నాను. భాగోలేదనడంతో బాగులేదనక తప్పలేదు. మన్నించంది జహాపనా! అన్నాడు. బీర్బల్‌ మాటలకు అక్బర్‌ ఆనందించాడు.

8) గాలి మేడలు *

ఒకర్లోజున అక్బర్‌, బీర్బల్‌ కూర్చుని, కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళ మాటలలో గాలిమేడల ప్రసక్తి వచ్చింది. "బీర్బల్  అంటున్నారు అవి ఎలా ఉంటాయి. వాటిని కట్టడానికి ఎంత  ఖర్చవుతుంది” అని, ప్రశ్నించేడు అక్బర్‌పాదుషా!.  “జహాపనా! గాలిమేడలు కట్టడం అందరికి సాధ్యపడే పనికాదు. కొందరికీ గాలిమేడలు కట్టడంలో ప్రావీణ్యత ఉంటుంది. సర్వసాధారణంగా గాలిమేడలు కట్టేవారిని గుర్తించడం కూడా కష్టం” అన్నాడు బీర్బల్‌.

ఆ మాటలకు అక్బర్‌పాదుషా తనకు గాలిమేడలు చూడాలని ఉన్నదని పనివారిని రప్పించి కట్టించవలసినదని, ఖర్చుకు వెనకాడవద్దని ఆదేశించేడు. సరే పాదుషావారి ఆజ్ఞమేరకు గాలిమేడలు కట్టించుతాను. వాటికి పునాదులు గోడలు ఉండవు. ఎన్నిఅంతస్తులైనా కట్టవచ్చు. ఎన్ని అంతస్తులు కట్టించవచ్చో, అన్ని అంతస్తులు కట్టగలవారిని రప్పించి మేడలు ఆరుమాసాల్లో కట్టిస్తానన్నాడు.

ఆ తర్వాత బీర్బల్‌ పాదుషావారి దర్శనానికి రావడం మానివేశాడు. బీర్బల్‌ రాకపోవడంతో అక్బరుకు కాలక్షేపం జరగక కబురుచేసారు. పనివాళ్ళకోసం తిరుగుతున్నాను. వారు దొరకగానే మీ దర్శనానికి గాలిమేడలతో పాటు వస్తానని సమాధానం పంపించేడు. అనుకున్న ప్రకారం ఆర్నెల్ల కాలం గడచిపోగా బీర్బల్‌ ఒకనాడు పాదుషా వారి సన్నిధికి. ఒకవ్యక్తిని తీసుకొని వచ్చేడు.

“ఏమయ్య బీర్బల్‌! గాలిమేడల నిర్మాణం ఎంతవరకు వచ్చింది”. అని ప్రశ్నించాడు అక్బర్‌పాదుషా! ప్రభువులవారు సావదానంగా ఉంటే గాలిమేడల దర్శనం జరుగుతుంది. ఇతడే గాలిమేడలు నిర్మాణంలో ఎంతో ప్రవీణుడు. నా వద్దకు వచ్చిన ఇతడు మీ దర్శనమును కోరి యున్నందున మీ తావునకు తీసుకువచ్చాను. కొద్ది క్షణాలు మీరితనితో మాట్లాడినచో వీనికి గల ప్రావీణ్యత అవగతమౌతుంది”. అన్నాడు బీర్బల్‌.

“నువ్వు చాలా ప్రవీణుడవని బీర్బల్‌ చెబుతున్నాడు. నీది యే ఊరు? నీ తల్లితంద్రులెవరు? నువ్వేం చేస్తుంటావు?” అని అక్బర్‌ ఆ వ్యక్తిని ప్రశ్నించాడు. “జహాపనా! ఏమని చెప్పను. చాలా చరిత్రగలిగిన సమర్దుడను. నా తల్లిదండ్రులు వాళ్ళు కాబట్టి నన్ను పెంచగలిగేరు. మా స్వగ్రామమైన. బర్మల్‌నగరుకు తరచుగా పహిల్వానులు వచ్చేవారు. వారితో పసితనంలోనే కుస్తీలు పట్టేవాడ్ని నాపేరు చెబితే మల్లయోధులు మా ఊరువచ్చేవారే గాదు.

ఇరుగుపొరుగు రాజులు నా క్తీర్తి విని నన్ను తమవద్దకు పిలిపించుకొని, కానుకలు నేను మోయలేనంతగా ఇచ్చేవారు. ఆ కానుకలతో నేనే నా తల్లితండ్రులను పెంచేవాడ్ని. ఒక్క మల్లవిద్యతోనే గాక ఇంకా అనేక విద్యలలో పేరు కీర్తులందుకున్నాను. తమవంటి ప్రభువులను ఆశ్రయించి, వారికి రక్షక్రుడిగా, వారి శ్రేయోభిలాషిగా ప్రవర్తించగల చతురుడను. మిమ్మల్ని ఆశ్రయించి ఒక చిన్న జాగీరును సంపాదించి, ఆ జాగీరుకు నా తండ్రిని సుల్తానున చేసి, వారి అంగరక్షకుడుగా నుండి మరొకటి మరొకటిగా జాగీర్లు సంపాదించుకుని, తమవంటి వారి  'స్నేహ సౌశీల్యాదులతో వర్దిల్లగల సమర్దత కలిగినవాడను. అంటూ ఇంకాయేమేమొ చెబుతున్న అతనిని బీర్బల్‌ ఆపుచేశాడు.

విన్నారుకదా ప్రభూ గాలిమేడలు కట్టడంలో ఇతనికి ఇతనే సాటి. గాలిమేడలకు నివేశనస్టలం - పునాదులు. - కిటికీలు అక్కరలేదు అన్నాడు.  గాలిమేడల నిర్మాణం వివరించడానికే ఈ గాలిమేడల శిల్పిని మీ వద్దకు తీసుకువచ్చేను. ఆశమీద ఆశ, ప్రగల్బాలమీద ప్రగల్బాలు, పేర్చి రమ్యమైన ఊహలు నిర్మించుకుని వాటిలో ఆకాశపధంలో ఊరేగడం ఈ గాలిమేడలు కట్టేవారిపని.

ఆశలపేర్పు - ప్రగల్బాల నేర్పు, ఊహలల్లుకోవడంలో ఓర్పు ఎదుటివారిని గమనించకుండా పొల్లు మాటలతో వట్టి మాటలతో బ్రతికేవారి పనే గాలిమేడలు కట్టడం - జహాపనా! పొల్గుల్లుకబుర్లు స్థిరం లేని ఆశలు. యుక్తాయుక్తాలు తెలియని డాంబికాలే గాలిమేడలు. సమర్ధతను గుర్తెరుగకుండా, సాధ్యా సాధ్యాలను గమనించుకోనట్టి వారి కల్పనా జగత్తులోనివే గాలిమేడలు” అని వివరించాడు బీర్బల్‌.

9) మనిషికన్నా కుక్క మిన్న *

అక్బరు పాదుషావారు సభాసదులను ఉద్దేశించి “సభికులారా! విశ్వాసము అవిశ్వాసము అంటుంటారు. ఏమిటది?” అని ప్రశ్నించెను... చేసినది- పెట్టినది, ఇచ్చినది స్వల్సమే అయినా గుర్తు కలిగి ప్రవర్తించడం విశ్వాసం అనబడుతుంది. ఆ విధంగా కాకుండా, ఇంకా ఇచ్చేరు కాదు; అని చేసిన మేలును మరచిపోయి ప్రవర్తించడం అవిశ్వాసం అనబడుతుంది” అని వివరించాడు బీర్బల్‌. 'అందుకు ఇందుకు చెప్పుకోదగ్గ వారెవరైనా ఉన్నారా?” అని ప్రశ్నించాడు అక్బరు. లేకేం పాదుషా విశ్వాసానికి పెట్టింది పేరు" శునకం". పెట్టింది స్వల్పమే అయినా! ఒకసారి తిన్నశునకం ఎల్లకాలం పెట్టిన వారి పట్ల గుర్తు కలిగి ఉంటుంది. వారికిగాని వారి ఇంటికిగాని యే విధమైన ఇబ్బంది కలుగకుండా గుర్తు కలిగి ప్రవర్తిస్తుంది.

మనిషి తనకు. ఇచ్చింది ఎంతయినా, చేసినమేలు ఎంతటిదైనా కృతజ్ఞత చూపకపోగా, కపట ప్రేమను అభినయిస్తూ, మరింతగా తనను ఆదరించలేదని అలుగుతాడు వారిక్షేమం కోరడం మాట అటుంచి, తన ప్రయోజనం కోసం ఎట్టి' చెడును చెయ్యడానికైన వెనుకాడడు. నరుని కన్నా విశ్వాస హీనుడు మరి ఉండబోడు. మీరు అంగీకరిస్తే రేపటిరోజున 'విశ్వాసం - అవిశ్వాసం' కలిగిన వారిని తమ సమక్షంలో నిలబెడతాను” అన్నాడు.

ఆ మర్నాడు...  అతనొక కుక్కను, ఒక వ్యక్తిని తీసుకుని సభకు వచ్చేడు. జహాపనా! ఇది నా వీధిలో తిరుగాడే కుక్క దీనికి అప్పుడప్పుడు శేషపదార్దాలను, 'పెడుతుంటాము. మా ఇంటివద్దనే ఉంటూ మమ్మల్ని, మా క్షేమాన్ని కోరుతూ మసలు కుంటుంది. అని చెప్పి దానిని నానుండి వెడలగొట్టమని సేవకులకు ఆజ్ఞాపించండి, నిదర్శనం మీకే తెలుస్తుందన్నాడు.

రాజభటులు దానిని వానినుండి తరమబోగా అదివారిమీద తిరగబడి తరిమి మళ్ళీ బీర్బల్‌ దగ్గరకి వచ్చి కూర్చున్నది. వెంట తీసుకువచ్చిన మనిషిని ముందుకు పిలిచి, సార్వభౌమా ఇతడు మా ఇంటి ప్రక్కవారి అల్లుడు ప్రతీయేటా ఇతడ్ని పిలిచి చీని చీనాంబరాలు, కట్నకానుకలు ఇచ్చి మర్యాద చేస్తుంటాడు మామగారు.

అతనికి ఈ యేడాది మామగారు యేమిచ్చారో అడగండి? అన్నాడు. ఏమయ్యా! మీమామగారు ఈ సంవత్సరం నీకు యేమిచ్చాడు? అని ప్రశ్నించాడు అక్బరు. "ఇచ్చాడు ప్రభూ,పెట్టు పోతల మొక్కుబడి తీర్చుకున్నాడు. కట్నకానుకల విషయంలో మామగారంత పిసినారి మరొకరుండడం, ఈ స్వల్పానికి మమ్మల్నీ రమ్మనడం మాకు ఖర్చులు కలిగించడం దేనికండి. ఆపాటి కట్నకానుకలు నేరుగా పంపించవచ్చుగదా. మేమురావడం దేనికి? అంటూ మామగారు చేసేపనులను దెప్పిపొడుస్తూ, మరింత చెప్పడంతో" అక్బరుపాదుషా వారికి అర్దమయ్యింది మనిషి ఎంత స్వార్ధపరుడో తెలిసింది.

కుక్కను మించిన విశ్వాసం గల జీవి మనిషిని మించిన విశ్వాసహీనుడు మహినుండరన్నది తెలిసేలా చేసి చెప్పిన బీర్బల్‌ను అక్బర్‌ పాదుషా పొగిడాడు.

10) ప్రత్తి వువ్వు *

పువ్వులలో యే పువ్వు గొప్పదో తెల్పవలసినదని అక్బరు పాదుషా ఒకనాడు. సభాసదులను ప్రశ్నించెను. గులాబీ అని కొందరు, మల్లె అని కొందరు, సంపెంగ అని కొందరు, ఇలా తలా ఒక విధంగా వర్ణించారు.

నువ్వేమంటావు బీర్బల్‌ అని అక్బరు వారు బీర్బల్‌ను ప్రశ్నించారు. “జహాపన! మన సభికులు చెబుతున్నట్టు యే పువ్వుకు ఆ పువ్వేగొప్పది. కాని అవన్నీ అలంకరణకు, వినియోగానికి గొప్పగా ఉపయోగవడుతున్న వువ్వులే. కాదనను, అవి లేనందువల్ల మనకు అవిలేని కొరతగాని కష్టము. నష్టము యేమీఉండదు. నన్నడిగితే వీటన్నిటి కన్నా గొప్ప పువ్వు ప్రత్తిపువ్వు అన్నాడు బీర్బల్‌. ఎందువల్ల అని ప్రశ్నించేడు అక్బర్‌. ప్రతిపువ్వు వల్ల ప్రత్తి, ఆ ప్రత్తినుండి నూలు, ఆ నూలుతో వస్త్రాలు తయారౌతుంటాయి. 

ఆ వస్త్రాలు మనకు మాన సంరక్షణకు సొగసుకు శోయగానికి తోడ్పడతాయి. ప్రత్తిపువ్వు లేకపోతే మనం అనాగరికులుగా దిగంబరులుగా ఉండిపోతే, మాన సంరక్షణలేని ఆటవికులుగా మసలుకోవలసి ఉండేది. ఆ సమాధానం అక్బరువారికేగాక సభాసదులందరి మన్ననలు పొందింది.

11) శిక్ష అమలు తప్పిన తీరు *

అక్బరు పాదుషా వారికి భోజనానంతరం 'తాంబూలం' వేసుకోవడం అలవాటుండేది. ఇందు నిమిత్తం పాదుషావారికి ఆకు, సున్నం, వక్క, సుగంధద్రవ్యాలు సమపాళ్ళలో అమర్చిఅందించే నిమిత్తం ఒక నౌకరుండేవాడు. అతడుకూడా ఎంతో జాగ్రత్తగా తాంబూలాన్ని తయారు చేసి అక్బరువారికి అందిస్తుండేవాడు. అతనికి అంత;పురంలోని ఒక చెలికత్తె పరిచయమయ్యింది. వాళ్ళిద్దరు అక్బరువారి అనుమతితో పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఒకనాడు నౌకరు పాదుషా వారికి తొంబూలం సిద్ధం చేస్తుండగా, అతని ప్రేమికురాలైన అంతఃపురం పరిచారిక అటుగా వెళ్ళడం తటస్థించింది. ఆమె చిలిపి చూపులు చూస్తూ నౌకరు తమలపాకులకు రాసే సున్నాన్ని గమనించుకోకుండా కాస్త ఎక్కువగా వ్రాసేడు. పాదుషావారికి నోరుపాకి సున్నం ఎక్కువరాసిన అశ్రద్ధవల్లనే అలా జరిగిందని తెలుసుకున్న పాదుషా తన కోపాన్ని వెల్లడి కానీయకుండా నౌకర్లు విడికెడు నున్నం పట్టుకురావలసిందని ఆజ్ఞాపించారు.

కారణం ఊహించుకొలేక పోయిన నౌకరు హుషారుగా వెళ్ళి సున్నంతో తిరిగి వస్తున్నాడు. అలావస్తున్నవాడ్ని బీర్బల్‌ చూచి అక్బర్‌ ఆదేశంమేరకు సున్నం. పట్టుకువెడుతుండదాన్ని తెలుసుకుని, వానిచే సున్నం తినిపించి శిక్షించడానికి అని గ్రహించుకుని. సున్నాన్ని పాదుషావారికి ఇస్తావుగాని, ముందుగా వంటశాలకు వెళ్ళి ఒక తవ్వెడు నేతిని త్రాగి పాదుషా వారివద్దకు వెళ్ళమన్నాడు నౌకరును. వాడు అదే ప్రకారం చేసేడు. అక్బరువారు వాడిని ఆ సున్నమంతా తినవలసినదని శిక్షవిధించాడు.

ఆ ప్రకారంగా తిన్న నౌకరు కడుపు గుడ గుడ మంటూ విరోచనమై పోగా సాఫీగా ఉన్నాడు... తిన్న సున్నం వాడినేంచేయకపోవడం గమనించిన అక్బరు బీర్బల్‌ను ఇలా ఎందుకు జరిగిందని, తాను విధించిన శిక్ష ఎందువల్ల తప్పిందని ప్రశ్నించాడు.

బీర్బల్‌ అంతఃపురం పరిచారికను పిలిపించి తాంబూలం అందించే సమయానికి ఆమె అటుగా వెళ్ళడం ఆ సమయంలో తనను చూస్తూ సున్నం వ్రాయడంలో ఎక్కువై ప్రభువులు కోపగించి సున్నం తినిపించడానికి వానిని తీసుకురమ్మనడం అది తెస్తుండగా బీర్బల్‌గారు చూచి విషయాన్ని ఊహించుకుని సున్నంవల్ల యే ఉపద్రవం జరగకుండా నేతిని 'త్రాగించడం వగైరా వివరాలను తనకు తెలిసిన మేరకు చెప్పింది.

అంతట బీర్బల్‌ కలుగజేసుకుని జహాపనా! ఈ తప్పు అతనిధికాదు. అసలుతప్పు. ఆ సమయంలో అతనికి కనిపించి, మనస్సును చంచలపర్చి ఆదమర్చిసున్నం రాసేలా అతడ్ని లోనయ్యేలా, చేసిన తప్పు ఆమెదని. ఈమెకు విధించవలసిన శిక్ష అతనికి విధించడం వల్ల అది అమలు జరగలేదు. ఈ ఇద్దరికి మీరు తగినట్లు..... శిక్షిస్తే ఇంక ఇటువంటి పొరపాటు జరుగదన్నాడు. అయితే ఆ శీక్షేదో నీవే నిశ్చయించు అన్నాడు అక్బర్‌ పాదుషా. వీరిద్దరికీ కళ్యాణంచేసి కట్టివేస్తే. ఇక చిలిపి చేష్టలు చేయకుండ ఉంటారు. అనగా శుభమస్తు అన్నాడు అక్బరుపాదుషా. ఆ దంపతుల వివాహ అనంతరం అక్బరు వారి తాంబూలం మరింత రుచికరమయ్యింది.

12) పాదుషావారు - పరిచారకుడు *

అక్బరు పాదుషావారు నిద్రలేస్తూ అంతఃపుర పరిచారకుని ముఖం చూచేరు. ఆ పరిచారకుడు కూడా తెల్లవారుతూనే తొలిసారిగా పాదుషావారి ముఖం చూచేడు. ఆనాడు దర్భారునందు పాదుషావారికి అన్నియు విరుద్ద వ్యవహారములు ప్రసంగములు నంభవించినవి. యేపని నవ్యముగా సానుకుల మొనర్చబడలేదు. పైగా వేటకు వెళ్ళిన పాదుషావారికి ఒక్క మృగము కూడా వేటకు చిక్కలేదు. అలసటచెందిన అక్బరు విశ్రాంతి కొరకై ఒక వటవృక్ష మునీడను గుర్రమును దిగబోగా కాలికి చిన్న దెబ్బ తగిలినది. ఆరోజు స్థితి గతుల గురించి ఎందుకలా జరిగినవని యోచించుకొనచుండగా ఉదయమున తాను తన పరిచారకుని ముఖము చూచిన విషయము జ్ఞప్తికి వచ్చింది. ఈనాడు సంభవించిన దుస్సంఘటనలకు తానుసేవకుని ముఖం చూచుటే కారణమని తోచింది.. వెంటనే ఆ సేవకుద్ని ఉరితీయవలసినదిగా తలారులకు ఆజ్ఞాపించెను.

సేవకుడు ఘోడు ఘోడున విలపిస్తూ బీర్బల్‌ వద్దకు పరుగు పరుగునవెళ్ళి విషయాన్ని వివరించి తనను కాపాడవలసినదని, తాను ప్రభువులకు తెలిసి తెలిసి యే అపచారం చెయ్యలేదని రోధించేడు. బీర్బల్‌ వానిని ఊరడించి తనవెంట ఆ పరిచారకుడ్ని అక్బరు వద్దకు తీసుకుని వెళ్ళేడు. ఇదేమిటి వీడ్ని ఇంకా ఉరితియ్యలేదు. ఎందుకు వీడ్ని నీవెంట నావద్దకు తీసుకువచ్చేవని కసురుకున్నాడు అక్బరు. ప్రభూ! వీడు తమతో ఒక ఫిర్యాదు చేసుకోవాలని, అందుకు తనను మీవద్దకు తీసుకు వైళ్ళమని నా వద్దకు వచ్చేడు. ఫిర్యాదును మీకు విన్నవించుకున్న తదుపరి వీడు తమ అజ్ఞానుసారం మరణశిక్ష అనుభవించెదనని అనుచున్నాడు అని వివరించాడు బీర్బల్‌.

ఏమిటా ఫిర్యాదు? అని అక్బరు ప్రశ్నించాడు. ఈ ఉదయం మీరు వాని ముఖం చూచినప్పుడే వాడికి మీముఖం చూడడం జరిగిందట. వాడి ముఖం చూచిన మీకు వ్యవహారం సాగకపోవడం, చిన్నగాయాలు కలిగాయి. కాని వాడికి మీ ముఖం చూడడంవల్ల ప్రాణాపాయమే సంభవించినదట. పాదుషావారు తగువిచారణ చేసి తనకు న్యాయము కలిగించవలసినదని పాడుముఖం ఎవరిదో నిర్ణయించవలసినది కోరుచున్నాడు. బీర్బల్‌ మాటలకు విస్తుబోయి. తన తొందరపాటును గ్రహించుకుని వాని శిక్షను రద్దుచేసి వానికి కానుకలిచ్చి తననేరాన్ని తెలియజెప్పినందుకు బీర్బల్‌ను అభినందించాడు.

13) అక్బరు వారి రామచిలుక *

అక్బరు పాదుషావారికి రామచిలుకను పెంచాలని, రామచిలుక పలుకులు వినాలని ఆసక్తి కలిగింది. బోయవాని వద్ద ఒక అందాల రామచిలుకను కొని, దానికి యేవిధమైన లోటు లేకుండా పెంచాలని శానించాడు. ముద్దు మాటలు నేర్పాలన్నాడు. దానికి యే కారణంవల్లనైనా యే లోపం వల్లనైనా చావు సంభవిస్తే అది చెప్పిన వానికి మరణశిక్షే అని శాసనం చేసెను. అందరూ మిక్కిలి జాగ్రత్తగావించుతారన్న విశ్వాసంతో ఈ శాసనాన్ని విధించడం జరిగింది.

ఆ చిలకపెరిగి పెద్దదై పసిడి పలుకులతో, ముద్దు మరిపెం కలిగిస్తూ అక్బరు వారికి ఆనందాన్ని కలుగజేస్తుండేది. వారంతా ఆ చిలుకను ఎంతో శ్రద్దగా పెంచుతుండేవారు. కొంతకాలానికి ఆ చిలుకకు తెలియని వ్యాధి ఏదో కలిగింది. సేవకులంతా కలవర పడిపోయేరు. వైద్యులను పిలిపించి వైద్యం చేయించారు. కాలవశాన దానికి రోగం కుదరక మరణించింది.

ఈ వార్తను ఎవరు పాదుషావారికి చెబితే వారికి ప్రాణాలు పోయే ప్రమాదంవల్ల ఎవ్వరు ఆసంగతిని పాదుషావారికి చెప్పలేదు. అలా చెప్పకపోవడం యావత్‌ పరివారానికి ముప్పు అన్నభయంపట్టుకున్నది. 'ఇందుకు బీర్బల్‌ సమర్హుడని నిర్ణయించుకుని విషయాన్ని ఆయనకు వివరించేరు.'

ఈ వార్తను అందుకున్న బీర్బల్‌ అక్బర్‌ వారివద్దకు వెళ్ళి “జహాపనా! మన రామచిలుక సామాన్యమైనది కాదు. పూర్వజన్మమున యోగీశ్వరుల సరసన .........  "క్షమించండి, కథ మిస్ అయ్యింది"

14) నమ్మకం గొప్పదా? భక్తి గొప్పదా? *

అక్బరు పాదుషా వారికి మనుష్యులకు నమ్మకం గొప్పదా, భక్తి గొప్పదా, అన్న సందేహం కలిగింది. సభలో బీర్బల్‌ని ఈ విషయమై ప్రశ్నించారు. నమ్మకమే గొప్పదని. ఎంతటి భక్తి అయినా నమ్మకంవల్ల రాణిస్తుందని భక్తి కన్నా నమ్మకమే గొప్పదన్నారు. ఈ సమాధానం పట్ల అక్బరుకు గురి కుదరలేదు. నిరూపించమన్నాడు. నెలరోజులు వ్యవధి కావాలన్నాడు బీర్బల్‌.

కొంతకాలం తర్వాత ఒకనాడు బీర్బల్‌ చెప్పుల జతనొకదానిని జరీశాలువలో చుట్టపెట్టి ఊరిపొలిమేరలో పూడ్చిపెట్టాడు. దానిపై గోరీని కట్టించి అది ఒక  సుప్రనిద్దమౌలీ దని వ్రచారం లేవదీసి నిత్యం ఆ 'గోరీ' వద్ద పూజలు సంకీర్తనలు జరిపించసాగాడు. కొంతకాలానికి ఈ గోరీపట్ల ప్రజలకు భక్తి కలిగింది. క్రమక్రమంగా పౌరులు తమ కోర్కెలను నివేదించుకుని, కలుగుతున్న ఫలితాలతో నమ్మకంను. పెంచుకున్నారు. ప్రజలలో పెంపొందుతున్న నమ్మకం రాజ్యం అంతటా విస్తరిల్లింది. నిత్యం తీర్ధం మాదిరి ఆ ప్రాంతం సుప్రసిద్దమయ్యింది.

అక్బరు వారికి కూడా ఈ సంగతి తెలిసింది. ఆ గోరీని చూడాలని ఆసక్తి కలిగి మందీ మార్చలంతో గోరీ వద్దకు చేరుకున్నాడు. ప్రజల తాలూకు అపారమైన భక్తిని చూచి అక్బరుకు సైతం నమ్మకం కలిగి ఆ గోరీకి నమస్మరించుకున్నాడు. బీర్బల్‌ మాత్రం దూరంగా నిలబడి ఇదంతా చూస్తుండడం గమనించిన అక్బరు వానిని పిలిచి యేమయ్యా నువ్విలా తటస్టంగా ఉన్నావేమిటి? అని ప్రశ్నించాడు. నువ్వుకూడా మొక్కుకో అని సలహా ఇస్తున్న సమయంలో ఒక నౌకరు వచ్చి జహాపనా! ఉదయపూర్‌ రాజ్యం వశమయ్యింది. అని వివరించాడు అక్బరు ఆనందించి చూసేవా బీర్బల్‌ ఈ గోరీ మహాత్యము అన్నాడు.

జహాపనా! తమరీ గోరీకి మొక్కినందువల్ల ఉదయపూర్‌ జయం సిద్ధించలేదు. అంతకుముందే జయం ప్రాప్తించింది. కాని నమ్మకం యొక్క గొప్పతనంవల్ల ఇది మీకు గోరీపట్ల గల భక్తి వలన సిద్ధించింది అని అనుకుంటున్నారు. చూడండి. అంటూ గోరిని పడగొట్టించి అందులోగిల శాలువాలో కట్టబడి ఉన్న చెప్పులను చూపించి 'నమ్మకం యొక్క గొప్పదనాన్ని నిరూపించాడు బీర్బల్‌.' అతనియొక్క యుక్తీయుక్తచర్యకు అక్బరు ఎంతగానో ఆనందించాడు.

15) మసీదులోని లక్షల నిధి *

ఒకనాడొక తల్లికొడుకు పాదుషా వారివద్దకు వచ్చి మసీదును కూలగొట్టి త్రవ్వడానికి అనుమతించవలసినదని కోరుకున్నారు. యేమిటి మీకీ విపరీత కోరిక. పవిత్రమైన మసీదును కూలగొట్టాలన్న ఆలోచన మీకెందుకు కలిగిందని ఆ తల్లీ కొడుకుల్ని అక్బర్‌పాదుషా గద్దిస్తూ అడిగాడు. జహాపనా! ఆ మసీదులో నాలుగులక్షల రొక్నన్ని పాతిపెట్టితిననీ. దానిని తీనుకుని సుఖంగా జీవించవలసిందనీ నా భర్త చనిపోతూ నాకు, నా కుమారునికి వ్రాత మూలకంగా తెలియజేసాడని, మరణించిన ఆ వ్యక్తి రాసిన పత్రాన్ని చూపించారు.

పత్రాన్ని బట్టి ఆ నగదును తీసుకొవడానికి అంగీకరించడం ప్రభువుగా తన ధర్మమని మహమ్మదీయుల పవిత్ర దేవాలయమైన మసీదును కూల్చేటందుకు అనుమతించడం నేరమని తటపటాయించాడు. అక్బరుకు యేంచెయ్యడానికి యేమి తోచలేదు.

బీర్బల్‌ను పిలిచి, ఇది చాలా గద్డుసమస్యగా ఉంది. నీ బుద్దిచాతుర్యంతో నువ్వే దీనిని పరిష్కరించాలని అతనిని బీర్బల్‌కు అప్పజెప్పాడు. పరిష్కరించడానికి కొంతవ్యవధిని కోరి, మసీదును పరిశీలించాడు భీర్బల్‌. ఎక్కడా డబ్బును దాచిన దాఖలాలు కనబడలేదు.

ఆ తల్లీకొడుకుల వద్దకు వెళ్ళి మృతుడు వ్రాసి ఉంచిన కాగితాన్ని క్షణంగా పరిశీలించాడు. మసీదులోని నాలుగుశిఖరాలలో రెండు కలిసేచోట డబ్బును నిక్షేపం చేసినట్టుగా అందులో. వ్రాయబడి ఉంది. రెండు మీనారులు కలిసేదెలాగునో బీర్బల్‌కు అంతుచిక్కలేదు. ఆలోచించగా మీనారులు కలిసేచోటు అంటే ఆ 'మీనారులనీబలు కలిసేచోట అని గ్రహించుకున్నాడు. అవి కలిసేచోట త్రవ్వించి, నాలుగులక్షల నిధి ఉండడం గమనించి దానిని ఆ తల్లీకొడుకులకు పాదుషా వారిచే ఇప్పించాడు.

విషయాన్ని, ఇంత నిశితంగా పరిశీలించి మనీదుకుగాని ఆ తల్లీకొడుకులకుగాని ఏవిధమైన నష్టము రాకుండా కాపాడిన బీర్బల్‌ను అక్బర్‌పాదుషా అభినందించాడు.

16) మంగలికి బ్రాహ్మణత్వం *

అక్బర్‌పాదుషాకు తన మంగలిపైన, అతని పనితనంపైనా అపారమైన అభిమానం కలిగింది. నీకేంకావాలో కోరుకోమన్నాడు పాదుషా. జహాపనా! మా మంగళ్ళను నాయీబ్రాహ్మణులంటారు. కాని నాకు బ్రాహ్మణుడిని కావాలని ఉన్నది కనికరించండి, అని కోరుకున్నాడు.

అక్బర్‌ వేదవిధులైన బ్రాహ్మణులను పిలిపించి, ఈ నా మంగలిని మీ పునీతమైన మాతాదిక్రతువుతో బ్రాహ్మణునిగా మార్చవలసినదని అదేశించాడు: 'ప్రభువుమాట మన్నించకపోతే శ్రేయస్సుకు ప్రమాదం కలుగుతుందని భయపడిన ఆ విప్రులు, ఆ మంగలిని నదిఒడ్డుకు తీసుకువెళ్ళి స్నానం చేయించి, మంత్రాలు ఉచ్చరించి, యాగాలు చేయించి నానాతంటాలు పడుతూ ప్రయత్నించారు.

ఈ సంగతి బీర్బల్‌కు తెలిసింది. ఒక నల్లమేకను నది ఒడ్డుకు తీసుకువెళ్ళి నీట ముంచి, దాని శరీరాన్ని నది ఒండ్రుమట్టితో రుద్ది, ఏవేవో మంత్రాలు చదవడం చేస్తున్నాడు. ఈ సంగతి తెలిసి అక్బర్‌పాదుషా నది ఒడ్డుకు వచ్చి బీర్బల్‌ను ఉద్దేశించి యేం చేస్తున్నావని ప్రశ్నించాడు.

అయ్యా ఈ నల్లమేకను కపిలగోవును చెయ్యడానికి ప్రయత్నిస్తున్నానన్నాడు. ఏమిటిది? నీకేమన్నా మతిపోయిందా. మేక కపిలగోవు కావడం ఏమిటని, అక్బరు బీర్బల్‌ను వెటకారం చేసాడు. క్షమించాలి జహాపనా! మంగలి బ్రాహ్మణుడుకాగా ఈ నల్లమేక కపిలగోవు కాదా? అన్న విశ్వాసంతో ప్రయత్నిస్తున్నాను అన్నాడు బీర్బల్‌. తన తెలివి తక్కువ తనానికి సిగ్గుపడిన అక్బరు తనను అతి సున్నితంగా సంస్కరించిన బీర్బల్‌ను అభినందించాడు.

17) తివాచీ మీద వున్నకానుక *

సభాసదుల తెలివితేటలు తెలుసుకొవాలన్న ఆలోచన కలిగిందొకనాడు అక్బరు పాదుషావారికి. దర్బారు సభానదులతో నిండి ఉన్నది. అధికార అనధికారులు, మంత్రిసామంతులు, బీర్బల్‌ ఆందరు సముచిత ఆసనాల మీద కూర్చుని ఉన్నారు.

అక్టరు వారు నౌకర్లను పిలిచి ఒక తివాచీని తీసుకువచ్చి సభామధ్యగా వెయ్యమన్నారు. వారలావెయ్యగా, ఒక వెండి పళ్ళెంలో రత్నాలు, బంగారు నాణాలు ఉంచి, ఆ పళ్ళెమును తివాచీకి మధ్యగా పెట్టించారు.

సభాసదులారా! విజ్ఞులారా! ఆ తివాచీ మీద సువర్జరత్నాలతో ఉన్న వెండిపళ్ళెం మీకొరకే ఏర్పాటు చేయించాను. మీలో ఎవరైనా తివాచీ మీద నడచి వెళ్ళకుండా - ఆ పళ్ళెమును తీసుకొనవచ్చునన్నారు అక్బర్‌వారు.

అటూ ఇటూ వెళ్ళకుండా, తివాచీని తొక్కకుండా, పళ్ళెమును తీసుకోవడం ఎల్లాగో తోచక ఎవరికివారు ప్రయత్నించకుండా ఊరుకున్నారు.

బీర్బల్‌ను ఉద్దేశించి నువ్వయినా తీసుకోగలవేమో ప్రయత్నించు అన్నారు. చిత్తం అని బీర్బల్‌ లేచి ఆ తివాచీవద్దకు వెళ్ళి దానిని చుట్టుతూ పళ్ళెంవరకు వెళ్ళి దానిని తీసుకుని తివాచీని యధాహప్రకారంగా ఎప్పటిలా ఉండేలా పరిచేశాడు. అక్బరు మరియు సభాసధులు ఆ పళ్ళెం తీసుకోవడంలో బీర్బల్‌ ప్రదర్శించిన బుద్ధిసూక్ష్మతను అభినందించారు.

18) గంట - ముసలి ఎద్దు *

అక్బర్‌ పాదుషా తన పరిపాలనలో భాగంగా ఒక గంటను దర్బారుకు సమీపంలో కట్టించారు. కష్టమేదైనా కలిగినవారు ఆ గంటను మోగిస్తే పాదుషావారు వచ్చి, వారికి కలిగిన కష్టనష్టాలను విచారించి తగిన న్యాయం సమకూర్చుతుండడం పరిపని. ప్రజలు దానిని “న్యాయగంట” అని ప్రశంసిస్తుంటారు.

ఒకనాడు ఒక ముసలిఎద్దు ఆ గంటవద్దకు వచ్చి తనకొమ్ములతో గంటకున్న త్రాటిని చుట్టబెట్టి లాగుతూ గంటను మొగించసాగింది. అక్బరు పాదుషావారు వచ్చి నోరులేని ఆ జంతువు గంటను లాగుతుండడం గమనించి దానికి కలిగిన బాధయేమిటో చెప్పలేదని దానికి ఏ విధమైన తీర్పును చెప్పలేక పోయేరు. బీర్బల్‌ను పిలిచి ఆ ముసలిఎద్దు ఫిర్యాదేమిటో తెలుసుకొని తగిన తీర్పును ఇమ్మనెను.

బీర్బల్‌ ఆ ఎద్దును గంటనుండి విడిపించి దానివెనుక కొంతమందినౌకర్లను పంపించేడు. అది వెళ్ళివెళ్ళి తన యజమాని ఇంటిముందు ఆగింది. దానిని చూచి యజమాని, తన్ని తరిమేసినా తిరిగి ఇది ఇక్కడకే వచ్చినదని దానిని మరల తరిమి వేయబోయెను. అదే దాని ఫిర్యాదుకు గల కారణమని గ్రహించిన రాజభటులు రాజాజ్ఞగా వానిని వెంట తీసుకుని బీర్బల్‌ వద్దకు తీసుకువెళ్ళారు.

ఓయీ! దానిని ఎందువలన తరిమివేయుచుంటివని ప్రశ్నించెను. మహాశయా! ఇది ముసలిదైపోయినది. పనిపాట్లు చేయలేక పోతున్నది. దీనిని పెంచుట వృధా, దండుగ అని ఊరిలోనికి తరిమివేసాను అన్నాడు.

ఓయీ! అది వయసున్నప్పుడు ఎంతో కష్టపడి వనులు చేనింది. ఇప్పుడు ముసలిదైపోయిన దీనికి తిండి పెట్టకుండుట నీకు తగునా? అన్నాడు బీర్బల్‌. మహాశయా! అక్కరకు ఉపయోగపడని దీనికి అలవిమాలిన ఖర్చు చేయుట నావల్లకాదు అన్నాడు. మరి నీ తల్లిదండ్రులు నిన్ను పెంచి పెద్దజేసి, నీ ఇంటిలో వృద్ధులై ఉన్నారుగదా. వారినికూడా తరిమివేయుదువా? అని అడిగాడు. వాళ్ళు నాకు జన్మనిచ్చి, 'నాకై శ్రమించిన వారినెట్లు తరిమివేయగలనని యజమాని అనగా, నీ తల్లిదండ్రులవలె నిన్ను 'పెంపొందజేసిన ఆ ఎద్దునుకూడా పోషించుట నీ విధి అని భోధించి ఎద్దును రక్షించెను. మూగజీవికి న్యాయము సమకూర్చిన బీర్బల్‌ను అక్బరువారు తగురీతిగా సత్కరించెను.

19) కాకుల లెక్క *

ఒకప్పుడు అక్బర్‌ పాదుషావారు, బీర్బల్‌ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో వారిమాటలు వారికే వినబడకుండా కాకులు దేవిడీచుట్టూ కావుకావుమంటూ అరవసాగాయి. అక్బర్‌, బీర్బల్‌ను ఉద్దేశించి, కాకులిలా ఇంత ఇదిగా అరుస్తున్నాయి. కారణం యేమిటంటూ ప్రశ్నించారు. అవి అరుస్తున్నది ఆనందంవల్ల షెహన్‌షా. కాకులకు ఒక అలవాటుంది. వాటికి ఎక్కడైన శుభం జరిగి రెండు మెతుకులు దోరుకుతాయంటే అవి తినడంతో తృప్తి పడక ఇరుగుపారుగుకాకులను విలిచి, తమతోపాటు ఆరగించమంటాయి. ఆ అలవాటుచొప్పున అవి ఆనందకోలాహలం అన్నాడు బీర్బల్‌.

అయితే ఇంతకీ వాటికింత ఆనందంకలిగి తోటికాకులను పిలవడంలోని విశేషమేంటి? అనడిగాడు అక్బరు. ఏముంది మహాహప్రభూ!. మీరు పరాకుపడినా ఈ రోజు మీ పుట్టినరోజని వాటికి గుర్తుండదు అన్నాడు  బీర్బల్‌. అల్లాగునా, నరే జరిగినదేదో జరిగిపోయింది. దొరికినదానితో వాటిని తృప్తిపడనియ్యి. మనంవాటికి ఒక మంచిరోజు చూచి మంచి విందుచేద్దాం.

ఏన ఊళ్ళో కాకులెన్ని ఉన్నాయో లెక్క పెట్టించమన్నాడు. చిత్తం అని పలికినాడు. బీర్బల్‌ వచ్చి జహాపనా కాకుల్ని లెక్క పెట్టాను. మగకాకులు నాలుగువేలు. ఆడకాకులు నాలుగువేలు. పిల్లకాకులు రెండువేలు ఉన్నాయన్నాడు. సరే వాటిని బోయిలచేత పట్టించి ఒకచోటకు చేర్చించు.  కాకుల లెక్కలో తేడాపాదాలుంటే పదార్దాలు పొడవుతాయన్నాడు అక్బర్‌. చిత్తం! తేడా ఉండడం సహజం. ఎందువల్ల నంటే మన ఇరుగుపొరుగు గ్రామాలకాకులతో మన ఊరికాకులకు చుట్టరికాలు ఉన్నాయి. ఇక్కడివి అక్కడికి, అక్కడివి ఇక్కడికి రావడం పోవడం వల్ల తేడాలుండవచ్చు. అని, సమర్దించుకున్నాడు తనకాకులలెక్కను బీర్బల్‌. వాని సమయోచితయుక్తికి అక్బర్‌ ఎంతగానో ఆనందించాడు.

20) దున్నపోతు పాలు *

అక్బర్‌ పాదుషావారి బీగమ్‌కు చాలా సుస్తీ చేసింది. వైద్యుడు వైద్యం చేస్తున్నాడు. ఆ రోజు వైద్యుడికి ఒక చిలిపి ఆలోచన కలిగింది. ప్రభువువారి ప్రేమాభిమానాలు చూరగొన్న బీర్బల్‌ను దెబ్బతియ్యాలన్న ఆలోచన కలిగింది. అక్బరు వారివద్దకు వెళ్ళి జహాపనా! బీగమ్‌గారికి వైద్యంచేయడానికి దున్నపోతు పాలు కావాలి. వీటిని సంపాదించడానికి బీర్బల్‌ ఒక్కడే సమర్థుడు. కనుక వానికి చెప్పి వెంటనే పాలు తెప్పించండి అన్నాడు. హకీం మాటలుకు ముందువెనుకలు ఆలోచించకుండా బీర్బల్‌ను పంపించి పాలుతేవాలన్న విషయం చెప్పిన వెంటనే తీసుకురావలసినదిగా ఆదేశించాడు.

'ప్రభువులచిత్తం ఏది ఎటువంటిది అన్న ఆలోచనలేకుండా ఆజ్ఞలు చేస్తుంటారు. ఈ పాలుఎక్కడైన సాధ్యపడతాయా. ఈపాటి విషయం కూడా ఆలోచించకుండా అనువుగా ఉన్నవారి మీద ఆజ్ఞలు జారీచేసేస్తారు. ఇప్పుడీ ఉపద్రవాన్ని దాటి నెగ్గాలి అని బీర్బల్‌ తలపట్టుకు కూర్చున్నాడు ఇంటివద్ద. భర్తపరిస్థితిని చూచిన బీర్బల్‌భార్య సంగతి తెలుసుకుని విచారించకండి. తెల్లవారేసరికి మీ సమస్యను పరిష్కరిస్తానని భర్తను ఊరడించింది.

ఆనాటి అర్దరాత్రి చెరువు గట్టుకువెళ్ళి బీర్బల్‌ భార్య బట్టలు ఉతకసాగింది. ఆ శబ్దం విన్న అక్బరు “ఎవరావిడ. ఇలా అర్దరాత్రి బట్టలుతుకుతున్నది. ఎందువల్ల? తెలుసుకురమ్మని” నౌకర్షి పంపించాడు. ఆ నౌకరు వెళ్ళివచ్చి “జహాపనా! ఆమె భర్త ప్రసవించేడట అతని బట్టలు ఉతుకుతున్నదట” అని చెప్పాడు. “యేమిటి! భర్త ప్రసవించేడా? ఈ వింత ఎక్కడైనా ఉందా! తెలుసుకుందామని” అక్బరు చెరువు గట్టుకు వెళ్ళి “ఏమిటమ్మా! మగవాడు ప్రసవించడమేమిటి? నువ్వు వానిబట్టలు ఉతకడ మేమిటి?” అని ప్రశ్నించాడు.

దున్నపోతు పాలివ్వగా మగవాడు ప్రసవించడంలో ఆశ్చర్యమేముంది అని బీర్బల్‌ భార్య ప్రశ్నించింది. అక్బరు తన పొరపాటును గ్రహించుకున్నాడు. “అమ్మా! నువ్వు బీర్బల్‌ భార్యవేనా. కాకపోతే ఇంతటి చాతుర్యం మరెవరికుంటుంది. నీ భర్తకు వేము పొరపాటు పని చెప్పాం అని క్షమించమన్నాడు. మర్నాడు సభలోజరిగిన విశేషమంతా చెప్పి క్షమార్పణ కోరుకున్నాడు అక్బర్‌.

21) నిజానికి, అబద్దానికి ఉన్న దూరమెంత?  *

ఒకనాడు అక్బర్‌పాదుషాకు ఒక అనుమానం కలిగింది. అబద్దం నిజం ఒకదాని వెంబడి ఒకటి అంటిపెట్టుకుని ఉంటాయి కదా. వీటికి మధ్యగల 'దూరమెంత? నిజం వెనుక అబద్దం, అబద్దం వెనుక నిజం, మసలుకుంటాయో గాని ఒకటున్నదోట మరొకటి ఉండబోదంటారు అదెంతవరకు నిజం అని అక్బరు బీర్బల్‌ను ప్రశ్నించాడు.

జహాపనా! మీరు చెప్పినది సరైనదే. నిజం వెనుక అబద్దం - అబద్దం వెనుక నిజం ఉండలేదు. ఒకదానితో మరొకటి నిలవలేదు. రెండింటికి అంటే అబద్దానికి నిజానికి గల మధ్యదూరం కంటికి చెవికి ఉన్నంతదూరం. ఎందువల్లనంటే చూచింది నిజం, విన్నది అబద్దం. కన్ను - చెవి ఒకచోటకు చేరలేవు. అన్నాడు బీర్బల్‌. ఆ మాటలకు అక్బర్‌ పాదుషా ఎంతో సంతృప్తిచెంది బీర్బల్‌ను సత్కరించాడు.

22) కళ్ళున్న కబోదులు *

ఒకనాడు అక్బరు పాదుషావారు 'బీర్బల్‌తో కలసి నగరసంచారానికి బయలుదేరారు. వారికి కొంతదూరంలో ఒక ముష్టివాడు - ఒక పౌరుడు, నువ్వు మోసగాడివంటే నువ్వు మోసగాడివని, దెబ్బలాడుకొంటూ కనిపించారు. పలువురు వాళ్ళవద్దకు వెళ్ళి ఎందుకిలా దెబ్బలాడుకుంటున్నారని ప్రశ్నించారు.

అయ్యా! నేను బిక్షగాడిని, దానధర్మాల నిమిత్తం నేను కళ్ళులేని కబోధిగా భిక్షమెత్తుకుంటున్నాను. ఈ దాత నన్ను గుడ్డివాడినని నమ్మి నాకు సత్తు నాణాన్ని భిక్ష వేశాడు. ఏమిటని మేలుకొని నేను వాదిస్తుంటే నువ్వు కళ్ళుండి కళ్ళులేని వాడిగా నన్ను మోసగించావని నన్ను నిందిస్తున్నాడు. తను చేసిన మోసాన్ని సమర్దించుకుంటున్నాడని వివరించాడు.

వాళ్ళ తగువును పరిష్కరించి, మంచినాణెం వాని కిప్పించి, మాయవేషాలు మాని, భిక్షమెత్తుకోవడం భిక్షగానికి సరైనమార్గమని నచ్చజెప్పి సాగనంపారు.

“బీర్బల్‌ వాడు అలా కళ్ళులేని కబోదిగా ప్రవర్తించడం తప్పుకాదా?” అన్నాడు అక్బర్‌. “కూటికోసం కోటివేషాలు ఎదుటి వారిదయకోసం తానుగుడ్డివాడుగా నటిస్తున్నాడు వీడు, కాని చాలామంది కళ్ళుఉండి కూడా కబోదుల్లా ప్రవర్తిస్తుంటారు” అన్నాడు బీర్బల్‌.

“అల్లాగయితే అల్లాంటి కబోదులు కళ్ళున్నవాళ్ళు ఎవరెవరో తేల్చి చెప్పవలసినదని” అక్బరు, బీర్బల్‌ను.

ఆ మర్నాడు ఊరుకు శివారున, సామాన్య దుస్తులు వేసుకుని బీర్బల్‌ ఒక వ్రాతగాడిని వెంట కూర్చుండబెట్టుకుని జోళ్ళు కుడుతూ కూర్చున్నాడు. ఆ త్రోవన వెళుతున్న వాళ్ళు బీర్బల్‌ను చూచి మీరు జోళ్ళుకుడుతున్నారా అని కొందరు, యేం చేస్తున్నారని మరికొందరు, అంటూ పలకరిస్తూ తమ దారిన వెళ్ళిపోతున్నారు. ఈ వైనం అంతా వ్రాతగానిచేత జాబితాగా వ్రాయిస్తున్నాడు. అదే. త్రోవన వెడుతూ అక్బరువారు బీర్బల్‌ను చూచి “యేం చేస్తున్నావు” బీర్బల్‌ అని ప్రశ్నించి, సమాధానం పొంది వెళ్ళిపోయారు.

మర్నాడు దర్బారులో బీర్బల్‌ తాను తయారుచేయదలచిన జాబితాను చూపించి “అక్బర్‌ వారికి నమస్కారం కళ్ళున్న కబోదులే మనరాజ్యంలో ఎక్కువగా ఉన్నారని” తేల్చి చెప్పాడు.

“మరి నన్ను ఏ జాబితాలో చేర్చావు?” అని అక్బర్‌ బీర్బల్‌ను ప్రశ్నించాడు. “తమర్నికూడ కళ్ళున్నకబోదుల్లోనే చేర్చాను. నేను చేస్తూన్న పనిని చూస్తూ కూడ తమరు ఏం చేస్తున్నావని అడిగారు” అని చెప్పాడు. అక్బరు పాదుషావారు మరి మాట్లాడలేదు.

23) మీసాలు లాగిన వానిని ఏం చేయాలి? *

ఆనాడు అక్బరు పాదుషావారు సభకు కాస్త ఆలస్యంగా వచ్చారు. సమయ పాలన పాటించే అక్బరువారి ఆలస్యానికి సభాసదులు తత్తరపడ్డారు. అది గమనించిన అక్బరు వారికి వారి తత్తరపాటు ఔచిత్యాన్ని గురించి 'ప్రశ్నించాలన్న ఆసక్తి కలిగింది. తమరాకకు గల ఆలస్యాన్ని సభాసదులకు వివరించారు.

నేను దర్బారుకు బయలుదేరి వస్తున్న సమయంలో' ఒకడు వచ్చి నా దుస్తులను చిందరవందర చేసాడు. గడ్డం పట్టుకుని పీకేడు. మీసాలను లాగి నన్ను బిత్తరపర్చాడు. వాడ్ని యేంచెయ్యాలో తోచక తేరుకుని సభవారినే నిర్ణయించమని అడగవచ్చని రావడంతో ఈ ఆలస్యం జరిగింది. నేనిప్పుడు వానిని యేంచెయ్యాలి. సభవారే నిర్ణయించాలన్నాడు అక్బరు.

“ప్రభూ! వానిని కఠినంగా శిక్షించాలి - చెరసాలలో పెట్టాలి. దేశంనుండి బహిష్మరించాలి. కొరడాలతో కొట్టించాలి”. అని ఎవరికి తోచిన శిక్షను వారు సూచించారు.

బీర్బల్‌ లేచి “ప్రభూ! వానిని మీరు ఏ విధంగానూ శిక్షించడం సబబు కాదు. మీపైకి వచ్చి మీదుస్తులు నలిపి, మీసాలు మెలిపెట్టి, గెడ్డం మెలిపెట్టి వ్యవహరించగల హక్కుగాని, అవకాశంగాని ఇతరులెవ్వరికి ఉండదు. తమ మనుమలకు మాత్రమే ఆ అవకాళం కలుగుతుంది, మీమీది 'మమతానురాగంతో, మీరు వారిపట్ల చూపించు గారమువల్లను మీతో ఈ తరహా చనువును ప్రదర్శించడం వారికే చెల్లుతుంది.

ఇలా తమతో ఆటలాడుకుని మిమ్ములను మురిపించు మీ మనువడికి మీరు మిఠాయిలు పంచి పెట్టాలి. ముద్దులు కురిపించాలి. కానుకలివ్వాలి” అని వివరించాడు బీర్బల్‌.

అతని ఆలోచనా సరళికి సహేతుకమైన వివరణకు, అవగాహనకు అక్బరుపాదుషావారు మిక్కిలి ఆనందించి వానిని కానుకలతో సత్కరించారు.

24) మంత్రిపదవికై దిలావకర్‌ఖాన్‌ గారు *

అక్బరు పాదుషావారి బావమరిది 'దిలావకర్‌ఖాన్' తనమట్టుకుతాను ఎంతో తెలివిగలవాడినని నమ్మకం. అంతటివాడైన తనను అక్బర్‌వారు గుర్తించ మంత్రి పదవినివ్వక 'సోమరిగా కూర్చుండబెట్టి నిరర్దకుణ్ని చేస్తున్నారని వాపోతుందేవాడు.

ఒకనాడు సాహసించి దిలావకర్‌ఖాను తనకు మంత్రివదవిని ఇవ్వవలనినదని అక్బరును కోరుకున్నాడు దిలావకర్‌. హాయిగా తిని కూర్చొనవలసిన నీకీ మంత్రిపదవి ఆశ దేనికి? మంత్రికి మంచి బుద్ధికుశలత ఉండాలి. జరుగనున్న వ్యవహారముల పట్ల మంచి అవగాహన ఉందాలి. ప్రజల మనస్సెరిగే ప్రాజ్ఞత ఉండాలి. అపాయంలోను ఉపాయాలలోను వివేకవిజ్ఞానాలుందాలి. రేపు సభలో నీ అభిమతాన్ని విచారణ చేస్తాను. అన్నాడు పాదుషా.

మర్నాడు దర్బారు జరుగుతుండగా అక్బరు పాదుషా దిలావకర్‌ఖానును సంభోధించి, “ఖాన్‌! ఇప్పుడీ దర్బారులో ఉన్నవారందరిలో ఉన్న ఆలోచనయేమిటో వివరించు” అని అడిగెను. అందుకు ఇదేమి ప్రశ్న సభాసదులందరి మనస్సులలోని ఆలోచనలు చెప్పుట ఎవరికి మాత్రము సాధ్యము అన్నాడు.

అంత అక్బరు, బీర్బల్ ను ఉద్దేశించి నువ్వేమైనా చెప్పగలవా అని ప్రశ్నించెను. "జహాపనా! ఈ దర్బార్ దిగ్విజయంగా జరగాలని, ప్రభువు గారు విజయపరంపరలతో ప్రజలను పరిపాలించాలని ఆలోచనలతో, ఉన్నారన్నాడు."

నిజామా ఇది అని అక్బరు సభికులను ప్రశ్నించగా నిజం అన్నారు అందరూ. ఏమంటావ్ దిలావకర్ ఖాన్. ఈపాటి విషయం గ్రహించలేని నీవు మంత్రిపదవికి నిర్వహించగలిగే ఆశను విడిచిపెట్టు హాయిగా దేవిడీలో కాలక్షేపము చేసుకొనుము" అన్నాడు అక్బరు. 

25) గాడిదలు పొగాకు తినవు *

ఒకనాడు అక్బరు పాదుషావారు బీర్బల్‌తో కలసి ఊరి పొలిమేరగల పొలాలను చూస్తూ వెడుతున్నారు. ఒక పొగాకుతోటలో రెండు గాడిదలు ఆ, మొక్కలతో పాటు మొలచిన గడ్డినిమేస్తూ కనిపించాయి. అక్బరుకు గేలిచేయాలన్న ఆలోచన కలిగింది. బీర్బల్‌కు తాంబూలంలో పొగాకు వేసుకునే అలవాటుంది. అది ఆస్కారం చేసుకుని “బీర్బల్‌ పొగాకు గాడిదలు కూడా తినడం లేదు”. అంటూ బీర్బల్‌కు స్ఫురించేలా మందహాసం చేశాడు.

పాదుషా తనను తాంబూలంలో పొగాకు వేసుకోవడాన్ని వెక్కిరిస్తున్నాడని గ్రహించుకున్నాడు బీర్బల్‌. “చిత్తం జహాపనా! గాడిదలు పొగాకును ఎప్పుడూ తినవని”, ఎగతాళి చేస్తున్నట్లుగా అన్నాడు. పొగాకు తినని తనను గాడిదగా వివరిస్తూ యుక్తిగా ఎగతాళి చేసాడని గ్రహించి క్షణంలో తన నేర్పును చూపించిన బీర్బల్‌ను అభినందించాడు

26) రెండు గాడిదల బరువు *

ఒకప్పుడు అక్బరు. బీర్బల్‌ కలసి సాయం సంధ్యలో విహరిస్తున్నారు - వారివెంట అక్బరు కుమారుడు కూడా ఉన్నాడు. వెళ్ళగా వెళ్ళగా వారికొక సుందర సరోవరం కనిపించింది. చుట్టుమెట్లు కలిగి ఆ ప్రాంతం ఎంతోమనోహరంగా ఉన్నది.

అక్బరు కుమారునకు ఆ సరోవరంలో స్నానం చెయ్యాలన్న కోరిక కలిగింది. అతడు తన తండ్రికి తన అభిలాషను వివరించాడు. పాదుషాకు కూడా స్నానం చెయ్యాలి అనిపించింది. వెంటనే తండ్రికొడుకులిద్దరు స్నానానికి సరోవరంలో దిగారు. వారి దుస్తులు బీర్బల్‌ని పట్టుకోమని ఇచ్చేరు.

ఒడ్డున తమదుస్తులు పట్టుకుని నిల్చున్న. బీర్బల్‌ను చూచి అక్బరుకు వేళాకోళం ఆడాలనిపించింది. “బీర్బల్‌' నీపై గాడిద బరువున్నది కదా!” అన్నాడు. ఆ మాటలలోని పరిహాసాన్ని పసిగట్టిన బీర్బల్‌ వాటిని తిరగవేసి చెప్పి అక్బరునే పరిహసించాలని అనిపించి ఆ విషయం పైకి తేలకుండా “జహాపనా! క్షమించండి. ఉన్నది ఒక్క గాడిద బరువు కాదు. ప్రభువులు పొరపడుతున్నారు. రెండు గాడిదల బరువున్నూదని వెటకారం చేశాడు.

ఆ మాటలో అంతరార్థాన్ని గ్రహించి, తానాడిన వెటకారానికి సిగ్గుపడి బీర్బల్‌ తెలివితేటలకు మిక్కిలి ఆనందించి అభినందించాడు.

27) ఆయుధమా - ఉపాయమా  *

అక్బరు, బీర్బల్‌ కలిసి వెడుతుండగా అక్బరుకు ఒక అనుమానం కలిగింది. మనిషికి ఆకస్మికంగా ఏదయినా అపాయం కలిగినచో ఆయుధమా - ఉపాయమా దేనివలన కాపాడబడును. అని ప్రశ్నించాడు అక్బరు - జహాపనా ఉపాయముంటే ఎటువంటి అపాయమునైన దాటవచ్చునని బీర్బల్‌ అన్నాడు. ఆ సమాధానము అక్బరుకు నచ్చక మనము ధరించే ఆయుధములు ఉత్తి అలంకారమునకేనా అని రెట్టించాడు అక్బరు.

సార్వభౌమా ఆయుధములు అలంకారమునకుకాదు. ఆత్మరక్షణకు అయినా వాటిని వినియోగించడంలోను సమయా సమయాలు గుర్తెరిగి ఎదుటి వారి బలపరాక్రమము గమనించి ప్రవర్తించగల ఉపాయమును ఆశ్రయించుటే అవశ్యము కాగలదన్నాడు.

ఇది బుజువుకాగలుగుటకే అన్నట్టు ఒక మధపుటేనుగు ఘీంకరిస్తూ వారి దిక్కుగా. వచ్చింది. దానిని నిరోధించుటకు వారి వద్దగల ఆయుధములు ఎంత మాత్రము సరికాదు. అది గమనించగల ఆలోచనే ముఖ్యము. వెంటనే వారిరువు పరుగు పరుగున వెళ్ళి ఒక ఇంటి అరుగుపై నిలబడ్డారు. ఏనుగు ఘీంకరిస్తూ తనదారిని తాను వెళ్ళిపోయింది. ఆయుధము కన్న ఉపాయమే కాపాడిన వైనాన్ని గుర్తించిన అక్బరు, బీర్బల్‌ సునిశిత ఆలోచనా సరళికి ముగ్గుడయ్యాడు.

28) పెండ్లి పిలుపు *

అక్బరు పాదుషావారు ఏ కోపం వల్ల బీర్బల్‌ను దేశంనుండి బహిష్కరించేరు. రాజుల కోపాలు అభిమానాలుగా మారడం సహజం. అలాగుననే బీర్బల్‌పట్ల అక్బర్‌వారి కోపం తొలగి పోయి ఆతడు లేకపోవడంతో ఏమీతోచక, అతడ్ని యేవిధంగానైనా రప్పించుకోవాలన్న అభిమానం కలిగింది.

ఆలోచించి ఆలోచించి ఒక ఉపాయాన్ని యోచించాడు. తమ దేవిడీ ముందు చిరకాలంగా ఉంటున్న యమునా నదికి వివాహం చేయదల్చుకున్నామని మీ మీరాజ్యాలలో గల నదులను వివాహాలకు పంపించవలసిందని ఫర్మానా జారీచేస్తున్నానని సంపన్న దేశాలరాజన్యులకు వర్తమానం పంపించేడు.

ఈ లేఖలందుకున్న రాజులెవరికి అక్బరువారి ఆదేశమేమిటో అర్దం కాలేదు. బీర్బల్‌కు తలదాచుకునే అవకాశమిచ్చిన రాజ్యాధినేత తనకు అక్బరు వారినుండి వచ్చిన లేఖను చూపించి, దాని ఆంతర్య అంత చిక్కడం లేదన్నాడు. మా నదులు పెళ్ళికి రావడం తలంపులోనే ఉన్నాయి. వాటిని తీసుకువెళ్ళడానికి మీ భటులను: పంపించవలసినదని ఒక ఉత్తరం వ్రాయించి పంపించాడు బీర్బల్‌.

ఆ ఉత్తరం చూచుకున్న అక్బరు ఆ రాజువద్ద బీర్బల్‌ ఉన్నాడని గ్రహించి, మంత్రి పురోహితులను పంపించి సగౌరవంగా బీర్బల్‌ను ఆహ్వానించి తన రాజ్యానికి రప్పించుకుని ఘనంగా ఆహ్వానించాడు.

తన తొందరను. మన్నించమని యధాప్రకారంగా తనకొలువులో ఉండి తనను తన సభికులను వినోదపర్పవలసినదని అభ్యర్థించాడు అక్పరుపాదుషా.

29) నలుగురు మూర్ఖులు *

అక్బరు పాదుషావారు ఒకనాడు తనకు ఎవరైనా నలుగురు మూర్ఖుల్ని చూపిస్తే మంచి బహుమతి ఇస్తానని ప్రకటించేడు. ఆనాటినుండి సభికులంతా ఒక నలుగుర్ని తీసుకువచ్చి ఇరుగో మూర్ఖులని చూపిస్తుండేవారు. యే ఒక్కరి మూర్ఖత్వం అక్బరుకు అంగీకారం లేదా ఆఖరుకు బీర్బల్‌ను యేమయ్యా నీకు ఎవ్వరూ మూర్ఖులు లభించలేదా అని ప్రశ్నించాడు.

మూర్ఖులు లభించడమే అసాధ్యమా. రేపటిరోజున ప్రవేశపెట్టతానన్నాడు. ఆ మర్నాడు ఇరువుర్ని తీసుకుని బీర్బల్‌ సభలోనికి వచ్చి, జహాపనా! వీరిరువు మూర్ఖాతిమూర్ఖులు, పరీక్షించండి అన్నాడు. వాళ్ళు మూర్ఖత్వమేమిటో నువ్వే వివరించు అన్నాడు అక్బరు.

మహాప్రభూ ఇతడు గొర్రె మీద కూర్చుని వస్తున్నాడు. నెత్తిన గడ్జిమోపు పెట్టుకున్నాడు అదేమిటయ్యా, మోపును గొర్రె వీపున పెట్టవచ్చుకదా అన్నాను. చిత్తం నా గొర్రె బాగా చిక్కిపోయింది. అతికష్టపడి మరీనన్ను మోస్తున్నది. దీని వీపున ఈ మోపును కూడ పెడితే ఈ బరువుకు అది చచ్చి ఊరుకుంటుంది. అందువల్ల ఈ బరువును నేనేమోస్తున్నాను అన్నాడు. ఇంతకు మించిన మూర్ఖత్వం ఉంటుందా అన్నాడు బీర్బల్‌

ఇక రెండవవాని మూర్ఖత్వాన్ని వివరించు. అన్నాడు అక్బరు. ఈ రెండవవాడు చెట్టెక్కి తాను కూర్చున్న కొమ్మనే నరుకుతున్నాడు. అదేమిటయ్యా అని నేను ప్రశ్నిస్తే అతడు నవ్వుకుని ఆపాటి తెలియదయ్యా, .కొమ్మతెగితే, నేనూ కొమ్మాక్రిందికి వచ్చేస్తాము దిగడం శ్రమ ఉండదు కదా! అన్నాడు ఈ మూర్ఖుడు.

మరినేను నలుగుర్ని తీసుకురమ్మన్నాను గదా! ఇద్దర్నే తీసుకువచ్చేవేం? అన్నారు అక్బరు. చిత్తం మిగిలిన ఇద్దరూ సభలోనే ఉన్నారు. అన్నాడు బీర్బల్. ఎవరు వారని ప్రశిర్నచేడు? అక్బరు. ఎందుకు పనికిరాని ప్రశ్నలతో అమూల్యమైన కాలాన్ని వ్యర్ధపుచ్చి, అనవసర శ్రమను కలిగించు తమరు, ఇందుకై శ్రమపడి మరేవిధమైన ప్రయోజనం లేని నిరర్ధక కార్యాన్ని సాధించిన నేను, మనమిద్దరం మిగిలిన ఇద్దరు మూర్ఖులం అన్నాడు. బీర్బల్‌ అంతర్యాన్ని గ్రహించాడు. అక్బర్‌ పాదుషా.

30) దొంగ ఎవరో తేల్చిన నేర్పు *

ఒకనాడు అక్బరుపాదుషా దర్బారుకు తన డబ్బును దొంగలించాడని. ఒక గానుగవాడు, ఒక కటికవాడు వచ్చి ఒకరిపై ఒకరు అక్బరుకు ఫిర్యాదు చేశారు.

వారిద్దరి అభియోగాన్ని విచారణ చేసాడు అక్బరు. తాను అంగడిలో కూర్చుని ఉండగా కటికవాడు వచ్చి నూనె కావాలని తనను అడిగేడని, తనులోపలికి వెళ్ళి నూనె తీసుకువచ్చేలోపుగా తన గళ్ళాలోని డబ్బును కటికవాడు అపహరించేడని వివరించాడు నూనెవాడు.

కాదు ఈ నూనెవాడే తన అంగడీకి వచ్చి గానుగనూనెను ఇచ్చి తనకు మాంసం ఇమ్మన్నాడని - నూనెను తీసుకుని దుకాణంలోపల ఉంచడానికి వెళ్ళి రాగా ఈ నూనెవాడు తన దుకాణంలోని గళ్ళాపెట్టెలోని డబ్బులు అపహరించేడని తన అభియోగాన్ని వివరించేడు.

వాళ్ళు వాదనను విన్న అక్బరు ఎవరు నేరం చేసినది నిర్దారించలేక బీర్బల్‌ను ఈ తగాదాను పరిష్కరించమని కోరారు.

బీర్బల్‌ పళ్ళెంలో నీళ్ళు పోయించి తెప్పించాడు. నాది నాది అంటూ వాదులాడుకుంటున్న ఆ డబ్బును పళ్ళెంలో వేయమన్నాడు. ఆ డబ్బు నీళ్ళలోవడడంతో జిడ్డు నీటివీద తేలింది.

దీనితో బీర్బల్‌..ఆ డబ్బు గానుగవాడిదేనని, కటికి వానిదే అయితే నీళ్ళు దుర్వాసన వేయాలని చెప్పి సొమ్ము గానుగవాడిదని తీర్పు చెప్పాడు. కటికివాడిని నిర్భందించి అడగగా అతడు తన నేరాన్ని అంగీకరించాడు. వాని నుండి చేమరికొంతడబ్బును, ఆ దొంగిలించినడబ్బును గానుకవానికిప్పించాడు బీర్బల్‌.

31) అక్బరుకు కనువిప్పు *

ఒకనాడు అక్బరు పాదుషావారికి ఒక చిలిపి ఆలోచన కలిగింది. అసలే అది శీతాకాలం. యమునలో నీళ్ళు చలికి వణికించేటంత చల్లగా ఉంటాయి. అటువంటి నీళ్ళలో ఎవరైనా రాత్రంతా కంఠం లోతు నీళ్ళలో ఉండగలరా అన్న ఆలోచన కలిగింది. ఎక్కువ నగదును బహుమతిగా ప్రకటిస్తే ఎవరు సాహసించుతారో చూడాలన్న ఆలోచన కలిగింది. ఆ విషయాన్ని ప్రజలందరికి తెలిసేలా ప్రకటించాడు.

ప్రజలు సాహసాన్ని డబ్బుమీద ఆషతో పరిక్షించాలని అక్బరు ఈ ప్రకటన చేశారేగాని, ఇందుకు పూనుకున్న వాళ్ళగతేమౌతుందో ఆలోచించలేదు అని తర్కవితర్కాలు చేసుకొని ఆ సాహసానికి ఎవరు ముందుకు రాలేదు.

అక్బరువారి రాజధానిలో ఒక నిరుపేద బ్రాహ్మణుడున్నాడు. ఎంతగా ప్రయత్నించినా, ఎంత కష్టపడినా ఒక్కనాణెంకూడా సంపాదించలేని దరిద్రంతో బాధపడుతున్నాడు. అక్బరుపాదుషావారి ప్రకటనను విని ఎంతగానో ఆనందించేడు. తనదరిద్రం తీరేమార్గం, అధికంగా ధనాన్ని పొందే అవకాశం కలిగిందని ఆనందించాడు.

ఒకనాటిరాత్రి తెల్లవార్లు యమునానది జలాలలో కంఠంలోతు నిలబడి తెల్లవారేవరకు ఉన్నాడు.

ఈ సంగతిని అక్బరుపాదుషాకు నివేదించుకున్నాడు. అక్బరు నమ్మలేక నువ్వు తెల్లవార్లు నీటిలో ఉన్నదాఖలాయేమిటి అని ప్రశ్నించాడు, దాఖలాలు సాక్షాలు యేమీలేవు నామాటేదాఖలా అన్నాడు. నేను నమ్మలేనన్నాడు అక్బరు. 

విచారం ముంచుకొచ్చింది. కళ్ళమ్మట నీళ్ళు జాలువారేయి. కంఠం గద్దదమైపోయింది. గద్గద స్వరంతో జహపనా మీ కోట బురుజు మీద ఉన్న దీపంసాక్షిగా నేను తెల్లవార్లు యమున నీళ్ళలోనే ఉన్నానన్నాడు. అల్లాగనా! అయితే నీ మాటను నమ్ముతున్నాను. నువ్వు నా కోటలోనీ దీపం వేడితో చలిబాధకు తట్టుకుంటూ ఉండగలిగేవు. కనుక నీకు బహుమతి ఇచ్చే అవసరం లేదు వెళ్ళిపొమన్నాడు.

ఆ బ్రాహ్మణుడు దిక్కుతోచక అక్బరు నిర్దాక్షిణ్యాన్ని తలచుకుంటూ ఏడుస్తూ ఇంటిముఖం పట్టాడు. దారిలో బీర్బల్‌ కనబడి సంగతంతా తెలుసుకున్నాడు. నువ్వు విచారించకు. నీకు పాదుషావారి బహుమతి లభించేలాగా చేస్తాను కాస్త ఓపికపట్టు. అంతవరకు ఇదిగో! ఈ సొమ్మును వినియోగించుకో, అని బీర్బల్‌ వానికి కొంతసొమ్మును ఇచ్చాడు.

కాలం గడచి పోతున్నది. బ్రాహ్మణుని సమస్యను పరిష్కరించే అవకాశం కోసం నిరీక్షిస్తున్నాడు బీర్బల్‌.

మరికొన్నినాళ్ళు గడచిన అనంతరం అక్బరుపాదుషాకు వేటకు వెళ్ళాలన్న ఆశ కలిగింది. మేటి విలుకాండ్రకు కబురు పంపించేడు అక్బరు పాదుషా. ఈ సంగతి బీర్బల్‌కు తెలిసింది. వెంటనే ప్రభువువారితో వేటకు బయలు దేరబోయే వేటగాళ్ళను కలసి - భోజనాలు చేసిన వెంటనే బయలుదేరవలసినదిగా సూచించి అలాగని వారిచేత అక్బరుకు కబురు చేయించాడు.

వెంటనే ఒక వెదురు కర్రమీద, పైన వంటపాత్రను కట్టించి, కర్రకు క్రిందను మంటను ఏర్పాటు చేసాడు. ఎంతకు భటులురాకపోవడంతో అక్పరు వారికొరకై కబురు చేశాడు - వారు భోజనాలు చేసిరావడానికి నిరీక్షిస్తున్నారు. వంటపూర్తవగానే వస్తారని బీర్బల్‌ వివరించాడు. ఇంత ఆలస్యం ఎందువల్ల! అని అక్బరు స్వయంగా వచ్చాడు. వంట చేస్తున్న తీరును చూచి యేమిటిది. వంట ఔతుందని ఇలా అయితే వంట ఎలా అనుకున్నారని ప్రశ్నించాడు అక్బరుపాదుషా.

కోటలోని దీపం వేడి యమునలో పీకలోతునీళ్ళలో ఉన్నవాని చలిని తగ్గించగా కర్ర క్రింది మంట వంటపాత్రలలో వంటను పూర్తిచెయ్యదని ఎలాగ అనుకోగలనని అక్బరుకు బీర్బల్‌ ఎదురు ప్రశ్నించాడు. అక్బరు తన తప్పును గుర్తించుకుని ఆ బ్రాహ్మణునకు బహుమతులిచ్చి కనువిప్పు కలిగించినందుకు బీర్బల్‌ను అభినందించెను.

32) రైతు బాకీ తీర్మానము *

అక్బరు పాదుషావారి రాజ్యములోని ఒకరైతు వద్ద ఒక భూస్వామి కొంత సొమ్మును అప్పుతీసుకొనెను. ఆ రైతు ఎన్నిసార్లు అడినను ఎంతగా బ్రతిమలాడి అడిగినను ఆ భూస్వామి అప్పును తీర్చలేదు. అక్బరువారితో ఫిర్యాదు చేసుకొందునని రైతు ఆ భూస్వామిని అదలించెను పాదుషావారివరకు వెలితే తగువు ముదురునని జంకి - ఉపాయమును ఆలోచించెను. నీ అప్పు తీర్చివేసెదను. నీతోనాకు గొడవదేనికి పత్రమును తీసుకొని రమ్మని చెప్పెను. రైతు మిక్కిలి సంతోషించి పత్రమును తీసుకుని కామందువద్దకు వెళ్ళెను, ఆ కామందు ఆ పత్రమును పుచ్చుకుని ముక్కలు ముక్కలుగా చింపివేసి నీకునేనేమియు బాకీలేను. ఎవరికి ఫిర్యాదు చేసుకుంటావో చేసుకో అని గదమాయించి కాపును తరిమివేసెను.

కాపు పాదుషావారి వద్దకు వెళ్ళి జరిగినదంతయు చెప్పి న్యాయము జరిపించ వలసినదని కోరెను. పత్రము - సాక్షులులేని ఆ అప్పును పరిష్కరించుట సాధ్యము కానందువల్ల అక్బరు ఆ తగవును బీర్బల్‌ను పరిష్కరించమనెను. రేపు సభకు రావలసినది తీర్చిచ్చెడనని బీర్బల్‌ వారిని పంపించివేసెను. అనంతరం బీర్బల్‌కాపు ఇంటికివెళ్ళి అతడే కాగితముపై నీకు పత్రము వ్రాసి యిచ్చెనని ప్రశ్నించెను. తెల్లకాగితముపై అని అతడు చెప్పెను. రేపు దర్బారునందు నిన్నిదే ప్రశ్న అడిగినప్పుడు గులాబి రంగు కాగితముపై వ్రాసి యిచ్చెనని చెప్పవలసినదని కాపునకు సలహా యిచ్చెను.

ఆ మర్నాడు దర్బారులో కాపునుకామందును విచారణచేయుచు బీర్బల్‌ కాపునుద్దేశించి ఓయీ! కామందు నీకు పత్రము వ్రాసి యిచ్చినాడనుచున్నావు. ఏ కాగితముపై వ్రాసియిచ్చెనో చెప్పగలవా? అని ప్రశ్నించెను. చిత్తము. గులాబి రంగు కాగితముపై వ్రాసి యిచ్చెను అని చెప్పెను. వెంటనే కామందు వానికి అడ్డంపడి నేను తెల్లకాగితముపై వ్రాసి ఇచ్చితినని నోరు జారెను. బీర్బల్‌ అతడ్ని బాకీదారుగా తీర్మానించి, ఆ కామందుచేత వానికాసొమ్ముతో పాటు మరికొంత సొమ్మును ఇప్పించెను.

33) మంచిలో చెడు - చెడులో మంచి *

ఒకానొక దేశపు రాజుకు అక్బరుపాదుషాను యేవిధముగానైనా వంచించి దెబ్బతీయ వలెనని యోచన కలిగింది. వెంటనే ఒకాయనకు ఉత్తరమిచ్చి అక్బరుపాదుషా వద్దకు పంపించెను. జహాపనా! తమరు విజ్ఞులు. జ్ఞానసంపన్నులు. నాకు మంచిలో చెడు - చెడులోమంచి తెలియజెప్పగల 'దాఖలాను, ఎంగిలి కతుకు కుక్కను, గాడిదను చూపవలసింది. ఇది మీరు చేయజాలనిచో మిమ్ములను ఓడినవారుగా పరిగణించి, మీ రాజ్యమును స్వాధీనము చేసుకొందుమని అందువ్రాసెను.

అక్బరునకు ఈ తికమకను సరిచేయగల చాతుర్యమేమియును తోచలేదు. బీర్బల్‌ను పిలిచి వ్యవహారమును సవిస్తరముగా చెప్పి - రాజు పంపించిన లేఖను ఇచ్చెను. బీర్బల్‌ దానిని క్షుణ్ణముగా చదివి అక్బరు వారిని కలవరపడవద్దని, ఏడాదిలోగా ఈ నాలుగు అంశములను తార్మాణముగ ఆ రాజునకు చూపెదనని వాగ్దానము చేసెను. అట్లువానికి లేఖ వ్రాయించి ఒక లక్ష బంగారు నాణెములు తీసుకుని ఆ దేశపు రాజధానికి చేరుకొనెను.

అక్కడగల కొత్వాలు ఇంటి ప్రక్కకాపురముంటూ ఆయనతో మైత్రిని చేస్తూ నగరంలో వ్యాపారంచేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు బీర్బల్‌. కొత్వాలుకు బీర్బల్‌కు మైత్రి చాలా గాఢంగా కొనసాగుతుండేది. ఒకనాడు కొత్వాలు ఒక వేశ్యను తీసుకువచ్చి బీర్బల్‌ సమక్షంలో నాట్యం చేయించాడు. బీర్బల్‌ ఆమెకు వందసువర్ణనాణెములను బహుకరించాడు. అంతమొత్తమును మున్నెన్నడు పొందని ఆ వేశ్యకు బీర్బల్‌ పట్ల ప్రేమాభిమానాలు పెరిగి, ఆయనవద్దశే ఉండి ఆయనను సేవిస్తూఉండుటకు అనుమతిపొంది అక్కడే ఉంటుండేది.

బీర్బల్‌ ప్రవర్తనకు అభిమానించి కొత్వాలు ఒక అందగత్తెను తెచ్చివానికిచ్చి పెళ్ళిచేసెను. ఇలా కాలంగడుస్తుండగా ఒకనాడు బీర్బల్‌ ఒక పుచ్చకాయను కోసి గుడ్డతోమూటగట్టితెచ్చి భార్యకిచ్చి దానిని రహస్యముగా దాచవలసినదని, తాను రాకుమారుని చంపి వానితలను ఇలా మూటగట్టి తెచ్చానని, ఎవరికైనాతెలిస్తే ప్రమాదమని చెప్పాడు. ఆమెకు కడుపుబ్బరం ఆగలేదు. కొత్వాలువద్దకు వెళ్ళి రాత్రి తనభర్త రాజకుమారుడ్ని చంపి తలను తెచ్చి ఇంట్లో దాచెనని. చెప్పింది. కొత్వాలు వెంటనేవెళ్ళి బీర్బల్‌ను బంధించి తన రాజుసమక్షాన నిలబెట్టాడు. రాజు కోపోద్రిక్తుడై వానికి మరణశిక్షను విధించేడు. తనకు ఉరిశిక్ష విధించిన సంగతిని భార్యకు, తన ఉంపుడు గత్తెకు చెప్పవలసినదని కోరుకున్నాడు. ఆ ప్రకారం రాజు తన భటులను పంపించి ఆ వార్తను వారికి చెప్పించెను.

వేశ్య తలారి వద్దకు వెళ్ళి అతనికి లంచమిచ్చి బీర్బల్‌ ఉరిశిక్షను రెండుగంటలు వాయిదా వేసేలా చేసింది.

వేశ్య ఇదేమీ తెలియనట్లు మహారాజుసన్నిధికి వచ్చి నాట్యప్రదర్శన చేసింది. రాజు మెచ్చి యేంకావాలో కోరుకోవలసినదన్నాడు. బీర్బల్‌ ఉరిశిక్షను రద్దుచేసి ఆయనను విడిచిపెట్టమని కోరింది. వేశ్యకిచ్చిన మాటప్రకారం మహారాజు బీర్బల్‌ మరణశిక్షను రద్దుచేశాడు.

అప్పుడు బీర్బల్‌, మహారాజుకు తనను పరిచయం చేసుకుని తాను అక్బర్‌పాదుషా వారినుండి - వారిని మీరు కోరిన నాలుగు అంశాలును నివేదించుటకు వచ్చి ఇక్కడ ఉంటున్నానని వివరించాడు.

అయితే వాటిని విశదీకరించమన్నాడు. రాజా మీరు కోరిన వాటిలో మొదటితి మంచిలో చెడు - ఇదుగో ఈవిడ నా భార్య. మగనిపట్ల మంచిగా మసలుకోవలసినట్టిది. కాని ఈ మంచి ఆమెలో నాకు అపకారం చేసే చెడు అంకురించి, కొత్వాలుకు నాపై ఫిర్యాదు చేసి నన్ను బంధింపజేసింది. ఈమె మంచిలో చెడుకు నిదర్శనం.

మీ కొత్వాలు ఈ ఎంగిలిమెతుకులు కతికేకుక్క అంగడిలో వెలసిన కుక్కకు నిదర్శనం. చెప్పుడు మాటలు విని ఉపకారిని, మంచివాడిని ఐన నాపట్ల 'పెడభావం కల్పించుకుని వినిమయలక్షగాని విస్మరించి అంగడిలో అర్రులు చాచుకు కూర్చుని, చెప్పుడు మాటలు ఎంగిలి మెతుకులు కతికేకుక్క ఈయన అంగడిలో కుక్కగా గతిమాలిన వాణిజ్యం చేసే కుక్కకు నిదర్శనం.

అనిపలికి ఊరుకున్నాడు బీర్బల్‌. మరి నాల్లవదైన గద్దెపై గాడిదను కూడా నిరూపించమని రాజు ఆజ్ఞాపించేడు. మహారాజా తమరు మన్నించాలి ఈ నిరూపణను సహృదయంతో స్వీకరించాలి అని బీర్బల్‌ రాజానుమతిని తీసుకున్నాడు. మహారాజా! కుమారుడు హత్యచేయబడ్డాడు అనడంతోనే వివేకాన్ని వర్జించి, ఔనాకాదా అని విచారణ చేయకుందా మరణశిక్షను విధించిన మీ రాజ్యాధికారం మీ బుద్ధిహీనత, గద్దెపై గాడిదకు మీరే నిదర్శనం అన్నాడు బీర్బల్‌.

బీర్బల్‌ సమాధానాలకు సంతృప్తి చెందిన మహారాజు వానిని సముచితంగా సత్కరించి, యధోచితకానుకలతో, భేరీ మృదంగ వాయిద్యాలతో నగరమంతటా ఊరేగించి అక్పరుపాదుషావారి సన్నిధికి సాగనంపెను.

34) గుర్రపు రౌతుకు న్యాయము *

ఒకనాడు అక్బరువారి దర్బారుకు రాజభటులు ఇద్దరు ఆగంతుకులను తెచ్చి పాదుషావారి ఎదుట నిలబెట్టారు. జహాపనా! వీరిద్దరు మన దేశస్థులు కారు. ఒకే గుర్రముపై మననగరానికి వచ్చేరు. గుర్రంమీదనుండి దిగిన వీరు గుర్రమును నాదంటే నాదని వాదులాడుకుంటున్నారు. అందువల్ల వీరిపోరును పరిష్కరించుటకై వీరిని మీ సన్నిధికి తీసుకువచ్చేము. అన్నారు.

గుర్రం ఎవరిదన్నది నిర్ణయించలేక అక్బర్‌ ఆ వ్యవహారాన్ని పరిష్కరించవలసినదని బీర్బల్‌కు అప్పగించాడు. గుర్రంమీద తాను వస్తూ తనముందునడచి వెడుతున్న వ్యక్తి రాజధానికే వస్తున్నాడని తెలుసుకుని ఆయనను దయతలచి, గుర్రం ఎక్కించుకున్నానని, తీరా దిగినప్పుడు గుర్రం తనదేనని పేచీ పెడుతున్నాడని ఒకడు.

కాదు అది నాగుర్రమే నేను దయదలచి వానిని గుర్రంపై ఎక్కించుకున్నానని మరొక్కడు చెప్పేడు. వాళ్ళమాటలు విని తగువును బీర్బల్‌ను పరిష్కరించమనెను. ఆనాటికి వెళ్ళిపొమ్మని మర్నాడు వచ్చి గుర్రాన్ని తీసుకువెళ్ళవలసిందని చెప్పివారిని పంపించివేశాడు బీర్బల్‌.

ఒక సేవకుడ్ని విలిచి గుర్రాన్ని ఆశ్వశాలలోని గుర్రాలలో కలిపికట్టవలసినదని శాసించేడు. మర్నాడు ఇద్దరు భటులురాగా వారిలో ఒకనిని గుర్రం అశ్వశాలలో ఉన్నది. వెళ్ళి తెచ్చుకోవలసిందని పంపించాడు. అతడు అశ్వశాలకు వెళ్ళి గుర్రాన్ని గుర్తించలేక ప్రతీ గుర్రాన్ని పరిశీలిస్తూ వాటి కాళ్ళతావులు తిని, ఏడుపు ముఖంతో బీర్బల్‌ చెంతకు చేరుకున్నాడు. రెండవవానిని వెళ్ళి గుర్రాన్ని తెచ్చుకోవలసిందని అశ్వశాలకు పంపించాడు బీర్బల్‌. ఆ గుర్రంవానిని గుర్తుపట్టి సకిలించింది. అతడు కూడా దానిని గుర్తించాడు.

అంత బీర్బల్‌ ఆ గుర్రం రెండవవానిదని నిర్దారణచేసి, మొదటివానిని చేసినమోసానికి శిక్షించి గుర్రాన్ని రెండవవానికి అప్పజెప్పెను.

35) జామ పండు గొప్పది *

ఒకనాడు నిండు దర్బార్‌లో సభికులను ఉద్దేశించి అక్బర్‌పాదుషా వారొక ప్రశ్నను వేశారు. మనం నిత్యం అనేకపళ్ళను తింటున్నాం. వీటిలో యే.పండు గొప్పది చెప్పవలసిందన్నాడు అక్బరు.

సభాసదులంతా మాట్లాడకుండా ఊరుకున్నారు. ఎవడు ఏపేరు చెబితే" 'ప్రభువులవారు యేవిధంగా భావిస్తారో వారి మనస్సులో యే పండు గొప్పదన్న ఆలోచన ఉన్నదో అని ఊరుకున్నారు.

కొంతసేపటికి బీర్బల్‌ లేచి నిలుచుని పాదుషావారు అనుమతిస్తే యే పండు గొప్పదో తాను చెబుతానన్నాడు. చెప్పవలసిందన్నాడు అక్బరు.

జహాపనా! మనం తినేపళ్ళు చాలా ఉన్నాయి. మామిడిపళ్ళు వాటిలో టెంకను పారేస్తున్నాము. కనుక అదివ్యర్ణము. ఇక సపోటా పండును పరిశీలిస్తే అందులో గింజలను ఉమ్మివేస్తున్నాం. అట్లాగే శీతాఫలంలోని గింజలను ఉమ్మివేస్తున్నాం. టెంకాయ - పుచ్చకాయ ఇలా యేపండును పరిశీలించినా పరిపూర్ణంగా మనం స్వీకరించడం జరుగడం లేదు. కనుక ఇవేవి గొప్పవి కావు అన్నాడు బీర్బల్‌.

ఓయీ! బీర్బల్‌ పళ్ళలో గొప్పదాన్ని చెప్పమన్నామే గాని, గొప్పది కాని దానిని చెప్పమనలేదు. నువ్వు గొప్పవి కాని వాటినే పేర్కొంటున్నావు. గొప్ప పండేదో తెలిసిన చెప్పుము లేదా తక్కిన వారివలె నువ్వును ఊరుకొనుము. అన్నాడు అక్బరు.

చెబుతున్నాను జహాపనా! మనముపయోగించే పళ్ళు యేవీ. మనకు పరిపూర్ణంగా వినియోగపడుటలేదని తెల్పుటకై పైవాటిని చెప్పేను. ఇంక గొప్ప ఫలం అంటారా! అది జామకాయ. అందులోని ఏదీ నిరుపయోగము కాదు. మొత్తం పండును మనము ఆరగించగలుగుతున్నాము కనుక జామపండే పళ్ళన్నింటికన్నా గొప్పదని వ్యాఖ్యానించేడు బీర్బల్‌.

36) పాదుషా వారికి ఇచ్చినంత కూలి *

ఒకనాడు అక్బరు పాదుషా బేగంతో కలసి వనవిహారం చేస్తున్నారు. వారి వెంట బీర్బల్‌ కూడా ఉన్నాడు. వనంలో తిరగ్గా తిరగ్గా బీర్బల్‌దృష్టి ఒక జామచెట్టుపై పడింది. దోరగా ముగ్గిన జామపళ్ళను తినాలన్న ఆశ కలిగింది. కొమ్మలు పట్టుకుని ఊపి పళ్ళను రాలగొడుతున్నాడు బీర్బల్‌.

క్రిందపడిన వాటిని అక్బరు ఏరుతున్నాదు. ప్రభువులు శ్రమపడుతున్నారని రాలిన జామపళ్ళను ఏరనారంభించాడు.

అదిచూచిన బేగం చతురంగా బీర్బల్‌ను ఉద్దేశించి ఏమయ్యా! విదూషకా పళ్ళను ఏరుతున్నందుకు నీకేమి కూలి కావాలని ప్రశ్నించింది.

బేగం సాహెబా తమరు పాదుషా వారికి ఇస్తున్న కిరాయినే నాకూ ఇప్వండి. అన్నాడు చతురంగా తనకేమీ ఇవ్వనక్కరలేదన్న సూచనను కలుగజేస్తూ.

37) ధైర్యానికి, పిరికితనానికి సమర్దత  *

పిరికితనానికి ధైర్యానికి చెప్పుకోదగ్గవారు ఎవరున్నారు. వారిని చూడాలని ఉన్నదన్నాడు అక్బరుపాదుషా. అసలు ఇటు ధైర్యానికి, అటు పిరికితనానికి సాటికా గలవారుంటారా? అని అక్బరుపాదుషా దర్బార్‌లోని సభాసదుల్ని ప్రశ్నించాడు.

ఎందుకు లేరు ప్రభూ! ఇందుకైనా అందుకైనా సరిసమానమైనవారు స్త్రీలు. వారికి వారేసాటి. రేపు ఒకస్త్రీని తీసుకువస్తాను. ఆమె ధైర్యాన్ని మీరే తెలుసుకోగలుగుతారు అన్నాడు బీర్బల్‌.

తాను చెప్పిన ప్రకారం ఒక స్త్రీని దర్బారుకు తీసుకుని వచ్చేడు జహాపనా! ఈమెకు గల ధైర్యసాహసాలు అపారము. ఈమె తండ్రి కడుపేదవాడు. ఆర్థిక దుస్థితి కారణంగా ఈమెను ఒక వృద్ధునకు ఇచ్చి వివాహం చేసేడు. కాని ఆమెకు ఆమెభర్త నచ్చలేదు. కామము తీరని ఈమె ఒక ప్రియుడ్ని చూసుకొన్నది. అర్దరాత్రి ఆ ప్రియుడి చెంతకు వెళ్ళి తన కామముతీర్చుకుని, ఆ అర్ధరాత్రిలో ధైర్యంగా ఇంటికి తిరిగి వస్తుంటుంది. అవునోకాదో ఆమెనే అడిగి తెలుసుకొనండి అన్నాడు బీర్బల్‌.

అక్బరు ఆమెను ఉద్దేశించి “ఓ జవ్వని! బీర్బల్‌ చెబుతున్నది నిజమేనా” అని ప్రశ్నించాడు. ఆమె  ఔను. నా భర్తకు డబ్బున్నదే గాని రూపు రేఖా విలాసములు, జవసత్వములు లేవు. ఈ కారణంవల్ల నాకునా యవ్వనము వ్యర్థము కావడానికి నాకు మనస్కరించలేదు నా మనస్సుకు నచ్చినవాడు - నన్ను ఆనంద పారవశ్యమున తేల్చి లాలించగలవాడు నాకులభించాడు.

వానిని కలుసుకొనడం రాత్రులందు మాత్రమే సాధ్యము. మరి అతణ్ని కలవడానికి రాత్రి, చీకటి అని నేను జంకితే ఎల్లాగా - ఎంతగా ధైర్యం చేస్తే నేను అంతగా అతని పొందుతో సుఖపడగలను అన్నది. ఆమె ధైర్యసాహసాలకు అక్బరు అబ్బురపడ్డాడు.

బీర్బల్‌ నువ్వు చెప్పిన దానిని బట్టి, ఈమెమాటలను బట్టి, ఈమె ధైర్యవంతురాలని బుజువయ్యింది. మరి ఈమె పిరికిదనానికి బుజువేమిటి అని అక్బరు ప్రశ్నించాడు.

జహాపనా! అందుకు కూడా ఈమె సమర్భురాలే. ఈమె గృహం ఎల్లా ఉంటుందో ఇంటయేమున్నాయో, వాటిపట్ల ఈమె ప్రవర్తన యేమిటో, ఆమెనే చెప్పమనండి. ఈమె పిరికితనం యేమిటో మీకే అర్దమౌతుందన్నాడు బీర్బల్‌.

అక్బరు ఆమెను, ఆమెయొక్క ఇంటివిషయాలనుచెప్పమన్నాడు. నాభర్త వ్యవసాయదారుడు. మా ఇంటినిండా ధాన్యంబస్తాలుంటాయి. అందువల్ల ఆ ధాన్యాన్ని ఆశించి ఎలుకలు మాఇంటికి కొల్లలుగా వస్తాయి. వాటికోసం పిల్లులు తిరుగుతుంటాయి. ఆ పిల్లుల్ని తరుముతూ కుక్కలుంటాయి. క్రింద కాలుమోపాలంటే నాకు భయం. ఎలుకలు కరుస్తాయని కలవరం.

వాటిని పట్టుకునే పిల్లులు వాటినోటకరుచుకుని ఎలుకలతో తిరిగే భయంకర దృశ్యాలు, వాటినోట రక్తం, చూస్తే నాకు కళ్ళు తిరుగుతాయి. ఆ పిల్లులను తరుముతూ ఇంటచొరబడే కుక్కలను తరిమితే తిరగబడి కరుస్తాయని నాకు తీరని భయం అన్నది. ఆమెయొక్క పిరికితనాన్ని విశ్లేషించి, పిరికితనానికి కూడా ఆమెకు ఆమెయే సాటి అన్నాడు బీర్బల్‌.

బీర్బల్‌ చాతుర్యానికి, పరిజ్ఞానానికి అక్బరు ఎంతగానో ఆనందించి అపారమైన కానుకలతో సత్కరించాడు.

****** Completed ******

తెనాలి రామకృష్ణ కథలు

అక్బర్ బీర్బల్ కథలు

పరమానందయ్య శిష్యుల కథలు

పంచతంత్ర కథలు

Post a Comment

Previous Post Next Post